దేవ‌స్థానం బోర్డు సంచ‌ల‌న నిర్ణ‌యం…ఇకపై “శబరిమల” దేవ‌స్థానంలో ప‌నిచేయ‌నున్న అర్చకులు ఎవరో తెలుసా..?

పురాత‌న కాలం నుంచి మన దేశంలో ద‌ళితుల‌కు జ‌రుగుతున్న అన్యాయాలు ఎలాంటివో అంద‌రికీ తెలిసిందే. స‌మాజంలో వారికి త‌గిన గుర్తింపు ఉండ‌దు. ఎక్క‌డికి వెళ్లినా అంట‌రానివారిగా వారిని చూస్తారు. ఇక దేవాల‌యాల్లోకి అయితే ప్ర‌వేశ‌మే ఉండదు. ఒక వేళ ఎవ‌రికీ తెలియ‌కుండా వారు ఆల‌యంలోకి ప్ర‌వేశిస్తే ఇక అంతే, వారికి దారుణ‌మైన శిక్ష వేస్తారు. అయితే ఇప్ప‌టికీ ఇంకా ఈ అస‌మాన‌త పోలేదు. కానీ కేర‌ళ‌లోని The Travancore Devaswom (Temple) Recruitment Board (TDB) మాత్రం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇక‌పై అక్క‌డి శ‌బ‌రిమ‌ల ఆల‌యంలో ప‌లువురు దళితులు అర్చకులుగా ప‌నిచేయ‌నున్నారు.

కాగా ప్రక్రియ‌ను రిక్రూట్‌మెంట్ బోర్డు అంత ఆషామాషీగా ఏం నిర్వ‌హించ‌లేదు. అందుకు అభ్య‌ర్థుల‌కు ప‌రీక్ష‌లు పెట్టింది. ఆ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ అర్చ‌కుల పోస్టుల‌కు గాను ప్ర‌వేశ ప‌రీక్ష‌ను నిర్వ‌హించింది. అనంత‌రం ఇంట‌ర్వ్యూలు చేసింది. ఈ క్ర‌మంలో అర్చకుల పోస్టుల‌కు గాను మొత్తం 62 మంది క్వాలిఫై అయ్యారు. కాగా వారిలో 42 మంది బ్రాహ్మ‌ణేత‌ర కులం వారే కావ‌డం విశేషం. వారిలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉన్నారు. 36 మంది బీసీలు ఉండ‌గా, 6 మంది ఎస్సీ, ఎస్టీ కులాల‌కు చెందిన వారు. ఈ క్ర‌మంలో వారు త్వ‌ర‌లో శ‌బ‌రిమ‌ల‌లో అర్చ‌కులుగా ప‌నిచేయ‌నున్నారు. 32 శాతం రిజ‌ర్వేష‌న్ కేట‌గిరి కింద 42 మందిని అర్చుకులుగా ఎంపిక చేశారు.

కాగా ట్రావెన్‌కోర్ ఆల‌య బోర్డు ద‌ళితుల‌ను అర్చ‌కులుగా ఎంపిక చేయ‌డం ప‌ట్ల చాలా చోట్ల హ‌ర్షం వ్య‌క్తం అవుతోంది. దేశవ్యాప్తంగా ఈ ఘ‌ట‌న సంచ‌ల‌న‌మే అవుతోంది. అయితే గ‌తంలో ఎర్నాకులంలోని ఓ శివాల‌యంలో అర్చకుడిగా ఎంపికై కూడా అక్క‌డి బ్రాహ్మ‌ణ అర్చ‌కుల కార‌ణంగా ఓ వ్య‌క్తి అర్చ‌కుని పోస్టుకు దూరమ‌య్యాడు. ఇక అంత‌కు ముందు కూడా అల‌ప్పుర‌లో ఉన్న ఓ దుర్గా ఆల‌యంలో మ‌రో ద‌ళిత అర్చుకున్ని కూడా ఇలాగే నిరాకరించారు. దీంతో వారు కోర్టులో పిటిష‌న్ పెట్టుకోగా అవి విచార‌ణ‌లో ఉండ‌గానే ట్రావెన్‌కోర్ దేవ‌స్థానం ఇలా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఏది ఏమైనా ద‌ళితుల‌కు అలా ఆల‌యాల్లో అర్చ‌కులుగా పోస్టులు రావ‌డం అంటే మాట‌లు కాదు, ఇదే తొలిసారి. క‌నుక ఈ నిర్ణ‌యం తీసుకున్న వారిని అభినందించాల్సిందే..!

Comments

comments

Share this post

scroll to top