పెళ్లికి ముందు మీరు పెళ్లి చేసుకోబోయే వారి గురుంచి మీరు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్య విషయాలు ఏంటంటే.?

పెళ్లికి ముందు చాలా మంది పెళ్లిచేసుకోబోయే వారిని కొన్ని ప్రశ్నలు అడగాలి/తెకుసుకోవాలి అనుకుంటారు. అందులో ముఖ్యంగా మీరు అడగాల్సిన/తెలుసుకోవాల్సిన కొన్ని ప్రశ్నలు :

ఫ్యామిలీ కి మీరు ఇచ్చే విలువ.. :

మీరు మీ ఇంట్లో వాళ్ళతో ఎంత సేపు టైం స్పెండ్ చేస్తారో, మీ ఇంట్లో వాళ్ళు అంటే మీకు ఎంత ఇష్టమో మీరు పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి ముందే తెలుపండి. ఎందుకంటే పెళ్లి తరువాత మళ్ళీ నువ్వు నీ కుటుంబంకు ఇంత దెగ్గరగా ఉంటావాని ముందే ఎందుకు చెప్పలేదు, వారితో ఇంత చనువుగా ఉండటం తగదు అని మిమ్మల్ని ప్రశ్నిస్తారు.

మందు ముచ్చట్లు మిత్రులు :

ఫ్రెండ్స్ తో ఎలా ఉంటారో, పెళ్లి తరువాత ఎలా ఉంటారనేది ముందే చెప్పండి. మీకు తాగుడు అలవాటు ఉంటే, ఎంత మొత్తం లో తగుతారు అనేది, మీరు ఫ్రెండ్ షిప్ కి ఎటువంటి విలువ ఇస్తారు అనే విషయం కూడా మీ భాగస్వామి కి పెళ్లికి ముందే తెలుపండి.

మీరు ఇది వరకు ఎవరినైనా ప్రేమించారా?

చాలా మంది, అడగాలి అనుకొనేది అడిగేది, మీకు లవర్ ఉన్నారా? లేరు అంటే ఎవ్వరు నమ్మరు ఈ కాలం లో, కనుక ఉంటే ఉన్నారు అని చెప్పేయండి. పెళ్లి చూపులకి ఒప్పుకున్నారు అంటే ఖచ్చితంగా మీది బ్రేకప్ అయి ఉంటుంది కనుక, మిమ్మల్ని పెళ్లి చేసుకొనే వారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. పెళ్లికి ముందే చెప్పడం వలన మీ దాంపత్య జీవితం లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి.

సంసారం ఒక చదరంగం :

మీరు ఏ సమయానికే పిల్లల్ని కనాలి అనేది కూడా పెళ్లికి ముందే మాట్లాడుకోవాలి, ఎందుకంటే పెళ్లి అయిన వెంటనే ఇప్పుడే మనకు పిల్లలు వద్దు కొన్నేళ్లు ఆగుదాం అని మీ భాగస్వామి మీతో అంటే మీరు అప్పుడు ఎంతో బాధకి గురవుతారు. అందుకే పెళ్లికి ముందే ఒక క్లారిటీ కి రావాలి.

నీకెంత, నాకెంత, ఎంతుంది, ఎలా చెయ్యబోతున్నావ్ :

మీరు ఎంత సంపాదిస్తున్నారో, మీకు వ్యక్తిగతంగా ఎంత మొత్తం లో అప్పు ఉందో (ఎడ్యుకేషన్ లోన్, కార్ లోన్, హౌస్ లోన్) ఇలా ఎవైనా ఉంటే మీరు పెళ్లి చేసుకోబోయే వారికి ఖచ్చితంగా తెలుపండి, ఎందుకంటే పెళ్లి అయ్యాక నీకు ఇంత మొత్తం లో అప్పు ఉందని ముందే ఎందుకు చెప్పలేదు అని కొట్లాటలు మొదలయ్యేదానికి ఆస్కారం వుంటుంది .

Comments

comments

Share this post

scroll to top