స్త్రీల గురించి భీష్ముడు చెప్పిన 7 ముఖ్య విషయాలు.!!

నేటి ఆధునిక సమాజంలో స్త్రీలకు గౌరవం సరిగ్గా లభించడం లేదనే చెప్పవచ్చు. కానీ ఒకప్పుడు అలా కాదు. ఒకప్పుడు.. అంటే.. ఈ కలియుగానికి ముందు.. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగాల్లో స్త్రీలకు సమాజంలో రక్షణ ఉండేది. వారిని ఆది పరా శక్తిగా కొలిచేవారు. సీత, ద్రౌపది, పార్వతి, సతి వంటి ఎంతో మంది పతివ్రతలు ఉండేవారు. ఈ క్రమంలోనే కురు వంశ సార్వభౌముడు అయిన భీష్ముడు అంపశయ్యపై పడుకున్నప్పుడు స్త్రీలకు సంబంధించిన పలు విషయాలను పాండవులు, కౌరవులకు చెప్పాడు. వాటిని ఇప్పుడు తెలుసుకుందాం.

స్త్రీలకు సంబంధించి భీష్ముడు చెప్పిన పలు ముఖ్యమైన విషయాలు ఇవే..

1. ఏ కుటుంబంలో ఉండే స్త్రీలను అయినా ఆ కుటుంబ సభ్యులు కచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఆమె వల్లే ఆ కుటుంబానికి మంచి పేరు అయినా, చెడ్డ పేరు అయినా వస్తుంది. కనుక ఆమె తెచ్చే పేరుకు కుటుంబమే బాధ్యత వహించాలి.

2. ఏ కుటుంబంలో ఉండే స్త్రీలను అయినా ఆ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. స్త్రీలు సంతోషంగా ఉంటేనే కుటుంబం సంతోషంగా ఉంటుంది. తద్వారా సమాజం బాగుంటుంది.

3. ఏ కుటుంబంలో అయితే స్త్రీ సంతోషంగా ఉండదో వారికి కష్టాలే ఉంటాయి. అన్నీ నష్టాలే కలుగుతాయి.

4. సమాజంలో ఉన్న ఇతర స్త్రీలను కూడా కచ్చితంగా గౌరవించాలి. లేదంటే వారి వల్ల కష్టాలు కలుగుతాయి. ఒక స్త్రీ మనకు ఏమీ కాకపోయినా ఆమెకు రక్షణగా ఉండాలి.

5. మహిళలకు వ్యతిరేకంగా పురుషులు ఏమీ చేయరాదు. మహిళలు శాపం పెడితే పురుషులు ఇబ్బందులు పడతారు.

6. గర్భంతో ఉన్న స్త్రీలు, పేద కుటుంబానికి చెందిన స్త్రీలకు ఇంకా ఎక్కువ మర్యాద ఇవ్వాలి. వారికి ఇబ్బందులు కలిగించకూడదు.

7. స్త్రీ గౌరవించబడని సమాజం నాశనమవుతుంది. స్త్రీలకు కచ్చితంగా గౌరవం ఇవ్వాలి. అందుకు రామాయణమే ఉదాహరణ.

 

Comments

comments

Share this post

scroll to top