క‌వ‌ల పిల్ల‌ల గ‌ర్భం ధ‌రించిన మ‌హిళ‌లు త‌ప్ప‌నిస‌రిగా దృష్టి సారించాల్సిన విష‌యాలేవో తెలుసుకోండి..!

మ‌హిళ‌కు మాతృత్వం ఓ వ‌రం. వివాహం అయిన ప్ర‌తి స్త్రీ తాను త‌ల్లి కావాల‌ని క‌చ్చితంగా అనుకుంటుంది. ఇక అనుకున్న‌ట్టుగానే త‌ల్లి అయితే ఆమె ఆనందానికి అవ‌ధులు ఉండ‌వు. అయితే కేవ‌లం ఒక శిశువే కాక క‌వ‌ల‌లు గ‌ర్భంలో ప‌డితే ఇంక ఆ ఆనందం మ‌రింత రెట్టింప‌వుతుంది. కానీ ఆ రెట్టింపు ఆనందానికి తోడు ప‌లు స‌మ‌స్య‌లు కూడా ఎదుర‌య్యేందుకు అవ‌కాశం ఉంటుంది. ఈ క్ర‌మంలో క‌వ‌ల‌ల గ‌ర్భం ధ‌రించిన మ‌హిళ‌లు త‌ప్ప‌నిస‌రిగా దృష్టి సారించాల్సిన ఆరోగ్య స‌మ‌స్య‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. క‌వ‌ల పిల్ల‌లు క‌డుపులో ప‌డితే అధిక శాతం మేర ప్రి మేచ‌ర్ డెలివ‌రీ (నెల‌లు నిండ‌కుండానే శిశువు జ‌న‌నం) అయ్యేందుకు అవ‌కాశం ఉంటుంది. దాదాపు 100కు 60 శాతం కేసుల్లో ఈ స‌మ‌స్య వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. దీని వ‌ల్ల పిల్ల‌ల అవ‌య‌వాలు స‌రిగా వృద్ధి చెంద‌వు. ఈ క్ర‌మంలో వారికి ఎలాంటి ఇన్‌ఫెక్ష‌న్లు సోక‌కుండా ఉండేందుకు వారిని ఇంక్యుబేట‌ర్ల‌లో ఉంచాల్సి వ‌స్తుంది.

twins

2. నెల‌లు నిండకుండానే పుట్టిన క‌వ‌ల పిల్ల‌లు అధిక శాతం మేర త‌క్కువ బ‌రువును క‌లిగి ఉంటారు. సాధార‌ణంగా అలాంటి వారి బ‌రువు దాదాపు 2.50 కిలోలు మాత్ర‌మే ఉంటుంది. (ఇద్దరికీ క‌లిపి). దీని వ‌ల్ల ఇలాంటి పిల్ల‌ల‌కు దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. ప్ర‌ధానంగా వినికిడి స‌మ‌స్య‌లు, దృష్టి స‌మ‌స్య‌లు, మాన‌సిక స‌మ‌స్య‌లు వ‌చ్చేందుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది.

3. క‌వ‌ల పిల్ల‌లు గర్భంలో ఉన్న‌ప్పుడు వారు ఆహారం కోసం పోటీ ప‌డ‌తార‌ట‌. ఈ క్ర‌మంలో మ‌హిళ 8వ నెల గ‌ర్భంతో ఉన్న‌ప్పుడు వారు ఎక్కువ‌గా పోటీ ప‌డ‌తార‌ట. దీని వ‌ల్ల వారిరువురికి స‌రైన పౌష్టికాహారం అంద‌ద‌ట‌. అయితే అల్ట్రాసౌండ్ స్కానింగ్‌తో దీన్ని ముందుగానే ప‌సిగ‌ట్ట‌వ‌చ్చ‌ట‌.

4. క‌వ‌ల పిల్ల‌ల‌ను గ‌ర్భం దాల్చిన మహిళ త‌న మొద‌టి మూడు నెల‌ల కాలంలో హైబీపీ, ద్ర‌వాలు త‌గ్గిపోవ‌డం, మూత్రంలో అధికంగా అల్బుమిన్ పోవ‌డం వంటి ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొనేందుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌. అయితే దీన్ని ముందుగానే గుర్తిస్తే చికిత్స చేయ‌వ‌చ్చు.

pregnant-woman

5. క‌వ‌ల పిల్ల‌లు క‌డుపులో ఉన్న గ‌ర్భిణీ స్త్రీల‌కు రక్తంలోని చక్కెర స్థాయిలు అమాంతంగా పెరిగిపోతాయ‌ట‌. అందుకు కార‌ణం ఆ క‌వ‌ల పిల్ల‌లేన‌ట‌. వారిరువురు తల్లిలో త‌యార‌య్యే ఇన్సులిన్‌ను అడ్డుకుంటార‌ట‌. అందుకే ఆమెకు గ‌ర్భంతో ఉన్నంత కాలం డ‌యాబెటిస్ ఉంటుంద‌ట‌.

6. ఇంకోర‌క‌మైన అనారోగ్య స‌మ‌స్య కూడా క‌వ‌ల గ‌ర్భం ధ‌రించిన మ‌హిళ‌ల్లో క‌నిపిస్తుంది. అదేమిటంటే అండాశ‌య పొర‌కు, మాయ‌కు మ‌ధ్య చీలిక ఏర్ప‌డ‌డం. సాధార‌ణంగా ఇది 9వ నెల గ‌ర్భంలో జ‌రుగుతుంది. కానీ క‌వ‌ల గ‌ర్భం ఉన్న‌ప్పుడు ఒక్కోసారి ముందే ఇలా జ‌రిగేందుకు అవ‌కాశం ఉంటుంది.

7. క‌వ‌ల‌లు గ‌ర్భంలో ఉన్న‌ప్పుడు పిండ న‌ష్టం జ‌రిగేందుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. అయితే ఇది సాధారణంగా అత్యంత అరుదుగానే జ‌రుగుతుంది.

8. క‌వ‌ల పిల్ల‌ల‌కు పుట్టుక‌తోనే కొన్ని అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. సాధార‌ణంగా వారికి గుండె, నాడీ మండ‌లం, జీర్ణాశ‌యం సంబంధిత స‌మ‌స్య‌లు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది.

twins

9. ట్విన్ టు ట్విన్ ట్రాన్స్‌ఫ్యుష‌న్ సిండ్రోమ్‌గా పిల‌వ‌బ‌డే మ‌రో ప‌రిస్థితిలో క‌వ‌ల పిల్ల‌లిద్ద‌రూ ఒకే మాయ‌ను షేర్ చేసుకుంటారు. దీని వ‌ల్ల వారిరువురికి జ‌రిగే ర‌క్త స‌ర‌ఫ‌రాలో అడ్డంకులు ఏర్ప‌డుతాయి. అయితే దీనికి వైద్యులు చికిత్స చేయ‌గ‌ల‌రు.

10. మ‌రో ప‌రిస్థితిలో క‌వ‌ల పిల్ల‌ల బొడ్డు తాళ్లు రెండూ చిక్కుకుని పోయేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే దీన్నిపిండం ఎదిగే ద‌శ‌లోనే గుర్తిస్తే సుల‌భంగా చికిత్స చేయ‌వ‌చ్చు.

11. క‌డుపులో కేవ‌లం ఒకే శిశువు ఉండి, ఆ శిశువు అసాధార‌ణ ప‌రిస్థితిలో ఉంటేనే సాధార‌ణంగా డాక్ట‌ర్లు సిజేరియ‌న్ చేస్తారు. అయితే క‌వ‌ల‌ల గ‌ర్భం కేసుల్లో చాలా వ‌ర‌కు నార్మ‌ల్ డెలివ‌రీనే అయ్యేందుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌.

12. పోస్ట్‌పార్ట‌మ్ హేమ‌రేజ్ అనే మ‌రో ప‌రిస్థితి కూడా క‌వ‌ల గ‌ర్భం ధ‌రించిన మ‌హిళ‌ల్లో క‌నిపిస్తుంది. అయితే ఇది డెలివ‌రీ అయ్యాకే తెలుస్తుంది. శిశువులు జ‌న్మించాక బ్లీడింగ్ ఎక్కువ‌గా అవుతుంటే దాన్ని పోస్ట్‌పార్ట‌మ్ హేమ‌రేజ్ కేసుగా భావించాలి.

Comments

comments

Share this post

scroll to top