శ్రీమంతుడికి వెళ్తున్నారా. అయితే చంటి గాడు చెప్పిన ఈ సీన్లు మిస్ అవ్వొద్దు.

వాడి పేరు చంటి,  సోషల్ మీడియా చంటి.  శ్రీమంతుడు మార్నింగ్  షో చూసి వచ్చి తన డైరీలో ఏదో రాయడం షురూ జేసిండు. అరె చంటీ ఎం రాస్తున్నావ్ రా అని అడిగామో..? లేదో…? ఏయ్ దూరంగా ఉండుండి నేను శ్రీమంతుడు సినిమా గురించి రాస్తున్నా అన్నాడు. అరె శ్రీమంతుడి సినిమా గురించి రాస్తున్నావా అయితే నేనూ చదువుతా అన్నాను. సరే రాశాక ఇస్తాలే అని .. డైరీ రాయడం పూర్తవగానే  ఇచ్చేశాడు. ఇతరుల డైరీ చదవడం తప్పే కానీ వాడి అనుమతితో చదవడం కరెక్టే కదా.. అందుకే చదువుతున్నా మీరూ వినండి.

టైటిల్: శ్రీమంతుడు సినిమాలో మిస్ కాకుండా చూడాల్సిన బిట్స్.(రెడ్ పెన్ తో రాశాడు మరి)

1)మహేశ్ బాబు లుంగీ కట్టే సీన్…
మహేశ్ లుంగీ కట్టేప్పుడు బ్యాక్ గ్రౌంట్ మ్యూజిక్ వస్తుంటే నాకు నా ఒడుగుల పంక్షన్లో లుంగీ కట్టించిన ఫీలింగ్ కలిగింది. అందరూ మహేశ్ వైపు వింతగా చూస్తుంటే నాకే సిగ్గేసింది.. ఎందుకంటే చిన్నప్పుడు నే కట్టుకున్న లుంగీ ఊడింది లేండి. వచ్చిరాని కట్టుడు కడితే ఊడదా మరి..

mahesh-lungi-in-srimanthudu.jpg.pagespeed.ic.z44_FoptIL
2) మహేశ్ కబడ్డీ ఆడే సీన్..
స్టార్ స్పోర్ట్స్ లో ప్రోకబడ్డీ వస్తున్న దగ్గర నుండి ప్రతీ మ్యాచ్ ను పక్కగా ఫాలో అవుతున్న నాకు… మహేశ్ కబడ్డీ మజా ఇచ్చింది. టచ్ పాయింట్ అయితే తెచ్చాడు , మరి బోనస్ వచ్చిందా లేదా అనేది డౌట్!

3) దేవరకోట..ఊరి చివర మామిడి తోట..లో మహేశ్ సైకిల్ మీద రావడం. తర్వాత ఓ డైలాగ్ చెప్పడం.
ముందు సైకిల్ మీద మిల్క్ బాయ్ లాగా మహేశ్ వస్తుంటే.. వెనుక కండలు తిరిగిన బాడీబిల్డర్లు బాడీగార్డ్స్ లాగా వచ్చే సీన్.. టైమ్ బాగుండి, ఆ ఫోన్ రాబట్టి మీరు బతికిపోయారనే డైలాగ్.  ఫోన్ రాకపోతే అదే జరిగేదా? లేక సీన్ రివర్స్ అయ్యేదా  అనేదే చిన్న డౌట్.

4) శృతి హాసన్ పెదాలు…
ఏదో ఆపరేషన్ చేయించుకుందంట ఆ అమ్మాయి.. ప్రతి సీన్లో ఈమె ఫేస్ కంటే పెదాలే ఎక్కువ కనబడతాయ్. ఈ సారి సినిమాకు వెళ్తే బైనాక్యులర్ రివర్స్ పెట్టి చూడాలి.

sruthi haasan
5) అలి ప్రతి సీన్…
ప్రతిసారీ లోపలికి తీసుకెళ్లి మిగితాది చెబుతా అంటాడు…లోపలికి తీసుకెళ్లినంత వరకు ఓకే కాని, మిగితాది చెప్పిండో లేదో… పార్ట్-2 లో చూస్తా!

ali

 

ఇదండి సోషల్ మీడియా చంటిగాడి వింత డైరీ… వాడి డైరీలో ఏ పేజీ చూసిన పంచితే ఫన్ పంచుతాడు… లేదంటే పంచ్ డైలాగ్ లతో ప్రశ్నిస్తాడు. మీరూ వాడితే టచ్ లో ఉండాలంటే క్లిక్ చేసుకోండి, వాడిని ప్రెండ్ చేసుకోండి. వాడి FB.ID: socialmediachanti.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top