ప్ర‌తిసారీ దిమ్మ‌తిరిగేలా కొట్టాడు….అత‌టి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కి హ్యాట్సాఫ్.!!!

సంద‌ర్భం-1 – (2011):  అది 2011., IIT-JEE ఫ‌లితాలు విడుద‌లయ్యాయి. ఆల్ ఇండియా ఫ‌స్ట్ ర్యాంక‌ర్ మ‌న తెలుగు తేజం అంటూ న్యూస్ ఛాన‌ల్స్ బ్రేకింగ్స్ మీద బ్రేకింగ్స్ న‌డుపుతున్నాయి. అత‌డే ఇమ్మ‌డి పృథ్వీ తేజ్. ఆ సంద‌ర్భంలో…ఓ టివి ఛాన‌ల్ ఇంట‌ర్వ్యూ లో మీ ల‌క్ష్యం ఏంట‌ని.? యాంక‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు…. సివిల్స్ ను సాధించ‌డ‌మేన‌ని స్ప‌ష్టంగా చెప్పాడు పృథ్వీ.!

సంద‌ర్భం-2 – (2015):  IIT- బాంబే విద్యార్థికి SAMSUNG భారీ ఆఫ‌ర్…. కోటి రూపాయ‌ల ప్యాకేజ్…విద్యార్థి మ‌న తెలుగోడే…అంటూ మ‌ళ్లీ బ్రేకింగ్స్…ఈ సారి కూడా అత‌డే…. ఇమ్మ‌డి పృథ్వీ తేజ్.! అప్ప‌ట్లో మ‌నోడి ఇంట‌ర్వ్యూ చూసిన ప్ర‌తి ఒక్క‌రు… మ‌నోడు అప్ప‌ట్లో సివిల్స్ అన్నాడు…ఇంక అటువైపు వెళ్ళ‌డు..కోటి రూపాయ‌ల ప్యాకేజ్ ను ఎవ‌రు మాత్రం కాద‌నుకుంటార‌ని అనుకున్నారంతా.!

సంద‌ర్భం-3- (2018): IIT విద్యార్థికి సివిల్స్ లో 24వ ర్యాంక్…. ఫ‌స్ట్ ఎటెంప్ట్ లోనే సివిల్స్ సాధించిన తెలుగోడు.! ఇది కూడా ఇమ్మ‌డి పృథ్వీ తేజే! వీడు మామూలోడు కాదు… అనుకున్న‌ది ప‌క్కాగా లెక్కేసి మ‌రీ కొట్టాడు.అది కాన్ఫిడెన్స్ అంటే…దేశానికి సేవ చేయాల‌నే అత‌ని క‌మిట్మెంట్ ముందు త‌న‌కొచ్చే కోటి రూపాయ‌ల జీతాన్ని కూడా లెక్క‌చేయ‌లేదు. స‌ర్వీస్ లో జాయిన్ అవ్వ‌డానికి రెడీ అయిపోయాడు పృథ్వీ .! ఆల్ ది బెస్ట్ పృథ్వీ… You Are a True Inspiration to all of us.

Comments

comments

Share this post

scroll to top