మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా త్వరగా కోలుకోవాలని…అభిమాని ఆవేదన.

ప్రముఖ సంగీత దర్శకుడు, మాస్ట్రో ఇళయరాజా శనివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.  ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో ఉన్నారు. అయితే ఆయన తర్వగా కోలుకోవాలని  ఓ వీరాభిమాని ఇలా రాసుకున్నాడు.

సార్… ఇళయరాజా సార్… త్వరగా కోలుకోండి సార్… మీరు ఆసుపత్రిలో ఉన్నారని తెలిసినప్పటి నుండి  … రోజు నే వినే కొత్తగా రెక్కలొచ్చెనా   పాట  ఎందుకో నాకు ఈ వేళ  చిరాకు తెప్పిస్తోంది. వేమన పద్యాల కంటే కూడా ఎక్కువగా నాకు మీ పాటలే వచ్చు.. మీ పాటలను కంఠతా చెప్పేయమంటే దగ్గరదగ్గర రెండు, మూడు శతకాల పాటలు ఆగకుండా చెప్పేయగలను అంతటి అభిమానిని నేను మీకు.

పడుకునే ముందు మీ…  నమ్మకు నమ్మకు ఈ రేయిని  అనే   పాటతో ఆ రోజుకు గుడ్ నైట్ చెప్పి,  ఒక బృందావనం సోయగం అనే పాటతో మరుసటి రోజుకు గుడ్ మార్నింగ్ చెప్పిన రోజులు నాకింకా గుర్తున్నాయ్.. అంతెందుకు నమ్మరుకానీ  నా దగ్గర నే చదివిన బుక్స్ కంటే ఎక్కువగా ఇళయరాజా కలెక్షన్స్ క్యాసెట్లే ఎక్కువగా ఉన్నాయ్. నా వాక్ మెన్ పాడిన 100 పాటల్లో 80 పాటలు మీరు కంపోజ్ చేసినవే ఉంటాయ్..

క్లాస్, మాస్ అనే తేడా లేకుండా మ్యూజిక్ తో మ్యాజిక్ చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మీరే… ప్రేమ ఎంత మధురం అని ప్రేమ లోతుల్ని సుకుమారంగా టచ్ చేసిన మీరు, ఇందువదన కుందరదన  అంటూ ఊపేసిన రోజులను ఎలా మరిచిపోగలను సార్….  అమాయక వెంకటేష్ తో బలపం పట్టి భామ్మ బళ్లో  అంటూ కొత్త ట్రెండ్ కు తెరదీసి , మాటే రాని చిన్నదాని కళ్లు పలికే ఊసులు అంటూ విరహ వేదనను   మీ పాట ద్వారా మా  కళ్లకు కట్టిన ఆ రోజులు, మీ పాటలు రోజుకోసారి అయినా గుర్తొస్తుంటాయ్ సార్.

BBC ప్రకటించిన టాప్ 10 సాంగ్స్ లిస్ట్ లో చిలకమ్మా చిటికేయంగా పాట ఉందంటేనే తెలుస్తోంది మీ సంగీతానికి ఉన్న దమ్మేందో….  సార్… ప్లీజ్ గెట్ వెల్ సూన్.  ఇప్పటి తరం పాటల అసలు రుచి ఏంటో తెలియక పాప్ ల వైపు పరుగులు పెడుతోంది.  మీ పాటల మాదుర్యాన్ని అందించడానికి  త్వరగా  రండి మాస్ట్రో… మీ మ్యూజిక్ తో మ్యాజిక్ చేయడానికి.

—————————————————–   చంటి———–

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top