అక్రమసంబంధం పెట్టుకొని సుఖం చూసుకుంది…పసిపిల్లల ఏడుపులు బయటకి వినిపించద్దని ఏం చేసిందో తెలుసా.?

అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న జీవిత భాగ‌స్వామిని మోసం చేస్తూ ఇత‌రుల‌తో అక్ర‌మ సంబంధాలు పెట్టుకునేందుకు నేటి త‌రుణంలో కొంద‌రు దేనికీ వెనుకాడ‌డం లేదు. అవ‌స‌రం అనుకుంటే ఆ జీవిత భాగస్వామిని కూడా త‌మ అక్ర‌మ సంబంధం కోసం అంత‌మొందిస్తున్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు త‌ర‌చూ జ‌రుగుతూనే ఉన్నాయి. అయితే ఇదే కోవ‌లో.. ఓ జంట కూడా త‌మ త‌మ జీవిత భాగ‌స్వాముల‌ను వ‌దిలేసి వేరేగా కాపురం పెట్టారు. అంత‌టితో వారు ఆగ‌లేదు. త‌మ‌కు జ‌న్మించిన పిల్ల‌ల‌ను రాచి రంపాన పెట్ట‌డం ప్రారంభించారు. దీంతో చివ‌ర‌కు ఇరుగు పొరుగు వారు ప‌ట్టించుకోవ‌డంతో ఆ పిల్ల‌ల‌కు ఆ బాధ నుంచి విముక్తి క‌లిగింది. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే…

తెలంగాణ రాష్ట్రంలోని గజ్వేల్‌ సమీపంలోని జాలిగామకు చెందిన మాచపురం సురేశ్‌ అలియాస్‌ సురేందర్‌కు పెళ్లైంది. కానీ భార్యను వదిలేశాడు. అలాగే వర్గల్‌ మండలం తున్కిఖాల్సకు చెందిన రేణుక అనే మ‌హిళ‌కు కూడా పెళ్లైంది. ఇద్దరు పిల్లలు దివ్య(4), డేవిడ్‌(రెండేళ్లలోపు బాబు) ఉన్నారు. కానీ ఆమెకు పిల్ల‌లు పుట్టాక భర్త ఆమెను వదిలేశాడు. దీంతో పిల్ల‌లిద్ద‌ర్నీ ఆమె త‌న వ‌ద్దే ఉంచుకుని పెంచుతోంది. అయితే గజ్వేల్‌లోనే కూలి పని చేసుకునే రేణుకకు, మాచపురం సురేశ్‌కు పరిచయం అయింది. క్ర‌మంగా అది వారి మ‌ధ్య వివాహేత‌ర సంబంధానికి దారి తీసింది. దీంతో గ‌త 20 రోజుల నుంచి సురేశ్‌ వర్గల్‌ మండలం నాచారంలో ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ, అక్కడే రేణుక, ఆమె పిల్లలతో కలసి ఓ రూంను అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడు. కాగా ఇద్ద‌రూ వేరే ప్రాంతానికి చెందిన వారు కావ‌డంతో రేణుక, సురేశ్ ల‌ను ఇద్ద‌రినీ ఇరుగు పొరుగు వారు దంప‌తులని న‌మ్మారు.

అయితే రేణుక‌, సురేష్ ఇద్ద‌రూ త‌మ సుఖం తాము చూసుకున్నారు కానీ, ఇద్ద‌రు పిల్ల‌ల గురించి ప‌ట్టించుకోలేదు. వారిని నిర్ల‌క్ష్యం చేయ‌సాగారు. మ‌రోవైపు వారిని రోజూ కొట్ట‌డం, గిల్ల‌డం, కాళ్లు, చేతులు మెలి తిప్ప‌డం, చేతులు క‌ట్టేసి పొగ గొట్టంతో వారి శ‌రీరాల‌పై వాత‌లు పెట్ట‌డం, వారి నోట్లో గుడ్డ‌లు కుక్క‌డం వంటి అమానుష చ‌ర్య‌ల‌కు పాల్ప‌డేవారు. దీంతో పాపం.. ఆ పిల్ల‌ల‌కు గ‌ట్టిగా అరిచేందుకు కూడా అవ‌కాశం లేక‌పోయింది. కాగా ఈ నెల 8వ తేదీన అలాగే రేణుక‌, సురేష్ లు పిల్ల‌ల్ని చిత్ర‌హింస‌లు పెడుతుండ‌డంతో ఆ బాధ‌కు తాళలేక దివ్య గ‌ట్టిగా అరుస్తూ బ‌య‌టకు వ‌చ్చింది. దీంతో ఇరుగు పొరుగు వారు వ‌చ్చి అస‌లు విష‌యం ఆరా తీయగా వారి బాగోతం బ‌య‌ట ప‌డింది. ఈ క్ర‌మంలో స్థానికులు దివ్య‌ను, డేవిడ్‌ను చేర‌దీసి దెబ్బ‌ల‌కు మందు రాశారు. వారికి తినేందుకు అన్నం పెట్టారు. త‌రువాత పోలీసుల‌కు స‌మాచారం చేర‌వేశారు. దీంతో పోలీసులు, బాల‌ల సంక్షేమ శాఖ అధికారులు వ‌చ్చి దివ్య‌, డేవిడ్‌ల‌ను చేర‌దీశారు. వారి త‌ల్లి రేణుక‌తోపాటు సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేసి వారిపై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఇక ఇప్పుడు మీరే చెప్పండి.. ఇలాంటి వారినేం చేయాలో..!

Comments

comments

Share this post

scroll to top