ఇక‌పై ఏటీఎంలు రాత్రిపూట 9 గంట‌ల త‌రువాత మూత ప‌డ‌తాయి. ఎందుకో తెలుసా..?

నోట్ల ర‌ద్దు అయిన‌ప్ప‌టి నుంచి నిజంగా మ‌న‌కు ఏటీఎంలు బంగార‌మే అయిపోయాయి. చూద్దామంటే అవి తెర‌చి ఉండ‌వు. ఉన్నా వాటిల్లో న‌గ‌దు ఉండ‌దు. దీంతో అప్ప‌ట్లో చాలా మంది డ‌బ్బు కోసం నానా ఇబ్బందులు పడ్డారు. అయితే ఇప్పుడు ప‌రిస్థితి అలా లేదు కానీ.. అడ‌పా ద‌డ‌పా మ‌న‌కు కొన్ని చోట్ల ఏటీఎంలు మూసివేసి క‌నిపిస్తున్నాయి. ఇక ప్ర‌తి నెలా 1వ తారీఖు వస్తే ఇప్ప‌టికీ ఏటీఎంల‌లో క్యాష్ ఉండ‌డం లేదు. ఇదంతా స‌రే.. అసలు విష‌యం ఏమిటంటే.. ఏటీఎంల‌కు వ‌స్తే… అవి ఇక రాత్రి ప‌నిచేయ‌వ‌ట. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. రాత్రి పూట ఏటీఎంలు మూసి ఉంటాయి. త్వ‌ర‌లో ఈ రూల్‌ను అమ‌లులోకి తేనున్నారు.

ఇక‌పై మ‌న‌కు రాత్రిపూట ఏటీఎంలు అందుబాటులో ఉండ‌దు. సిటీల్లో అయితే రాత్రి 9 గంట‌ల త‌రువాత ఏటీఎంల‌ను మూసేస్తారు. అదే గ్రామాల్లో అయితే సాయంత్రం 6 గంట‌ల‌కు, న‌క్స‌ల్స్ ప్ర‌భావం ఉన్న ప్రాంతాల్లో అయితే సాయంత్రం 4 గంట‌ల‌కు ఏటీఎంలను మూసేస్తారు. ఇక అలా ఏటీఎంల‌ను మూసేసే స‌మ‌యంలో వాటిల్లో ఉన్న క్యాష్‌ను తీయాల్సి ఉంటుంది. మ‌రి అస‌లు ఈ రూల్‌ను ఎందుకు తెస్తున్నారో తెలుసా..? ఏటీఎంల‌లో పెద్ద ఎత్తున క్యాష్ ఉంటుంది క‌దా.. క‌నుక వాటిల్లో ఉండే క్యాష్ చోరీ కాకుండా ఉండేందుకు ఇలా రాత్రి పూట ఏటీఎంల‌ను బంద్ చేస్తార‌ట‌. తిరిగి ఉద‌యం 6 గంట‌ల త‌రువాతే వాటిని ఓపెన్ చేస్తార‌ట‌. అనంత‌రం వాటిల్లో మ‌ళ్లీ క్యాష్‌ను పెడ‌తార‌ట‌.

ఇక ఇదే కాకుండా ఏటీఎంల‌లో క్యాష్‌ను పెట్టేందుకు వ‌చ్చే వ్యాన్‌ల‌లో జీపీఎస్‌, సీసీటీవీ కెమెరాల‌ను ఏర్పాటు చేస్తార‌ట‌. స‌ద‌రు వ్యాన్‌లో ఎప్పుడూ ఇద్ద‌రు సాయుధ సిబ్బంది ఉంటార‌ట‌. వారు సుశిక్షితులై, ఎలాంటి ప‌రిస్థితినైనా ఎదిరించ‌గ‌లిగే వారు అయి ఉంటార‌ట‌. అదేవిధంగా ఒక‌సారి వ్యాన్ రూ.5 కోట్ల‌కు మించి క్యాష్‌ను తీసుకెళ్ల‌కుండా చూస్తార‌ట‌. ఇవీ.. త్వ‌ర‌లో ఏటీఎంల విష‌యంలో కేంద్రం అమ‌లులోకి తేనున్న కొత్త రూల్స్‌. స‌రే.. సెక్యూరిటీ ప‌రంగా ఇలా చేయ‌డం క‌రెక్టే. కానీ అర్థ‌రాత్రి పూట ఆరోగ్యం బాగా లేక ఎవ‌రికైనా డబ్బులు అవ‌స‌రం అయితే..? అప్పుడు ఎలా సార్లూ.. ఇది కూడా కొంచెం ఆలోచించండి మ‌రి..!

Comments

comments

Share this post

scroll to top