ఇకపై “రొయ్యలు” తినకూడదు అంట..! ఎందుకో తెలుసా.? మీరనుకున్న కారణమైతే కాదు.!

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది తినే సీఫుడ్‌ ఆహారంలో రొయ్యలు ముఖ్యమైనవి. వీటితో రకరకాల డిషెస్‌ చేస్తారు. ఎలా చేసినా రొయ్యల ఫుడ్‌ భలే టేస్టీగా ఉంటుంది. అయితే కొందరు రొయ్యల ఆహారాన్ని ఇష్టపడరు లెండి. అది వేరే విషయం. ఇక అసలు మ్యాటర్‌కు వస్తే… ఈ రొయ్యల ఆహారాలను ఇకపై ముస్లింలు తినకూడదట. అవును, మీరు విన్నది నిజమే. అలా అని చెప్పి హైదరాబాద్‌కు చెందిన ఇస్లామిక్‌ విద్యాసంస్థ ఒకటి ఫత్వా జారీ చేసింది.

హైదరాబాద్‌లోని ప్రముఖ ఇస్లామిక్‌ విద్యాసంస్థ జామియా నిజామియా గత 142 ఏళ్లుగా సేవలు అందిస్తోంది. ఇది దేశంలో సుదీర్ఘకాలంగా నడుస్తున్న ఇస్లామిక్ డీమ్డ్‌ యూనివర్సిటీల్లో ఒకటిగా ఉంది. ఇక జామియా నిజామియా ప్రధాన గురువుగా ప్రస్తుతం ముఫ్తీ మహమ్మద్‌ అజీముద్దీన్‌ ఉన్నారు. అయితే ఈయనే తాజాగా ముస్లింలు రొయ్యలు తినడంపై ఫత్వా జారీ చేశారు.

ముఫ్తీ మహమ్మద్‌ అజీముద్దీన్‌ జారీ చేసిన ఫత్వా ప్రకారం ఇకపై ముస్లింలెవరూ రొయ్యలను తినరాదు. రొయ్యలు కీటకాల జాతి(ఆర్థ్రోపోడా)కి చెందినవట. అవి చేపల జాతికి చెందినవి కావట. తేళ్లు, సాలె పురుగుల వంటి కీటకాల జాతికి రొయ్యలు చెందుతాయట. కనుక అవి దుష్టమైనవి కాబట్టి రొయ్యలను తినరాదని ఫత్వా జారీ చేశారు. ఈ నెల 1వ తేదీ నుంచి ఫత్వా అమలులోకి వచ్చింది. అయితే ఈ ఫత్వాపై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. కొందరు ఈ ఫత్వాకు వ్యతిరేకంగా మారగా, కొందరు మాత్రం దీన్ని సమర్థిస్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటి ఆదేశాలు నిజంగా షాకింగ్‌గానే ఉంటాయి మరి..!

Comments

comments

Share this post

scroll to top