వాట్సాప్ లో కొత్త ఫీచర్..! ఇకపై అలా చేస్తే చదివేవారికి తెలిసిపోతుంది..! గ్రూప్ లో మెసేజ్ కొట్టేముందు చూస్కోండి.!

ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. దీని గురించి స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్ల‌కు పెద్ద‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. ఎప్ప‌టికప్పుడు కొత్త కొత్త ఫీచ‌ర్ల‌ను ప్ర‌వేశ‌పెడుతూనే ఉంది. యూజ‌ర్ల‌ను ఆకట్టుకుంటూనే ఉంది. ఈ క్ర‌మంలోనే గ‌త కొద్ది నెల‌ల కాలంలో ఉన్నో ప‌వ‌ర్ ఫుల్ ఫీచ‌ర్ల‌ను వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది. ఈ మ‌ధ్యే వాట్సాప్‌లో పేమెంట్స్ ఫీచ‌ర్ కూడా వ‌చ్చేసింది. దీంతో యూజ‌ర్లు వాట్సాప్ నుంచే నేరుగా ఆన్‌లైన్లో న‌గ‌దు ట్రాన్స్ ఫ‌ర్ చేసుకునేందుకు వీలుంటుంది. అయితే త్వ‌ర‌లో మ‌రో అదిరిపోయే ఫీచ‌ర్‌ను వాట్సాప్ అందుబాటులోకి తేనుంది. అదేమిటో తెలుసా..!

సాధార‌ణంగా సోష‌ల్ మీడియాలో ఏ విష‌యం వైర‌ల్ అయినా అది వాట్సాప్‌లో కూడా చ‌క్క‌ర్లు కొడుతూ ఉంటుంది. ఎన్నో వేల మంది అలాంటి వైర‌ల్ వార్త‌ల‌ను షేర్ చేస్తూ ఉంటారు. వాటిల్లో నిజం ఉంటుందో, లేదో తెలియ‌దు కానీ అలాంటి మెసేజ్ లు మాత్రం వైర‌ల్ అవుతూనే ఉంటాయి. అయితే స‌ద‌రు మెసేజ్‌ల‌లో నిజం ఉంటే ఏమీ కాదు, కానీ అవి అస‌త్యాలు అయితే దాంతో ఎవ‌రికైనా ఇబ్బందులే వ‌స్తాయి. ఈ క్ర‌మంలోనే ఇలాంటి న‌కిలీ, ఫేక్ వైర‌ల్ వార్త‌ల‌కు అడ్డుక‌ట్ట వేసేందుకు వాట్సాప్ త్వ‌ర‌లో ఫార్వార్డెడ్ మెసేజ్ అనే ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తేనుంది.

వాట్సాప్ లో త్వ‌ర‌లో రానున్న ఈ ఫార్వార్డ్ మెసేజ్ ఫీచ‌ర్ వ‌ల్ల ఏదైనా ఒక మెసేజ్ వాట్సాప్‌లో 25 క‌న్నా ఎక్కువ సార్లు షేర్ అయినా, ఫార్వార్డ్ అయినా అది ఫార్వార్డెడ్ మెసేజ్ అని చూప‌బ‌డుతుంది. దీంతో ఆ మెసేజ్ వైర‌ల్ వార్త అని తెలుస్తుంది. ఈ క్ర‌మంలో ఆ వార్త‌లో నిజం ఉందా లేదా అనే విష‌యం తెలుసుకోవ‌చ్చు. అలా న‌కిలీ వార్త‌ల‌కు అడ్డుక‌ట్ట వేయ‌వ‌చ్చు. అయితే వాట్సాప్‌లో 25 క‌న్నా ఎక్కువ సార్లు షేర్ లేదా ఫార్వార్డ్ అయ్యే మెసేజ్‌ల‌ను బ్లాక్ చేసేలా కూడా వాట్సాప్‌లో స‌దుపాయాన్ని అందివ్వ‌నున్నారు. ఈ ఫీచ‌ర్ ప్ర‌స్తుతం వాట్సాప్ బీటా వెర్ష‌న్ 2.18.67ను వాడుతున్న యూజ‌ర్ల‌కు ల‌భిస్తుండ‌గా, త్వ‌ర‌లో యూజ‌ర్లంద‌రికీ ఈ ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తేనున్నారు. ఏది ఏమైనా ఈ ఫీచ‌ర్ వ‌స్తే మాత్రం న‌కిలీ, ఫేక్ వైర‌ల్ మెసేజ్‌ల బెడ‌ద నుంచి మ‌న‌కు విముక్తి ల‌భిస్తుంది..!

Comments

comments

Share this post

scroll to top