తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి రాజమౌళి కామెంట్స్!!

మహాభారతాన్ని సినిమాగా తీయాలన్నది నా డ్రీమ్ ప్రాజెక్ట్, దానికి అయిదేళ్ళ పాటు  కసరత్తు చేయాలి. మహాభారతం నాలుగు పార్టులుగా తీయాలి,దానికి ఆరేళ్ళు పడుతుంది. దాని కోసం నటీనటులు నాకు ఆరు సంవత్సరాలు ముందుగానే డేట్స్ ఇవ్వాలన్నారు రాజమౌళి.

తన  సినిమాలకు ప్రేరణ రామాయణ , మహాభారతాలే అని రాజమౌళి గతంలో అనేక సార్లు చెప్పారు. దానికి తోడు బాహుబలి సినిమాతో చారిత్రాత్మక కథను కూడా సినిమాగా తీసి బ్లాక్ బాస్టర్ గా నిలపొచ్చని  రుజువు చేశారు రాజమౌళి. ఈ నేపథ్యంలో ఇప్పుడు తీయగల భారీ సినిమా ఏదైనా ఉందంటే అది భారతదేశానికే గురుబోధ అయిన మహాభారతం మీదే తీయాలి.
రాజమౌళి కి కూడా అదే డ్రీమ్ ప్రాజెక్ట్.
అయితే బాహుబలి సక్సెస్ తర్వాత మద్రాస్ iit విద్యార్ధులతో పాల్గొన్న ఓ సమావేశంలో ఓ కుర్రాడు రాజమౌళిని అడిగిన ప్రశ్న ఇది. సార్.. మహాభారతాన్ని వెండితెర మీద మాకెప్పుడు చూపిస్తున్నారు అని.దానికి రాజమౌళి పై విధంగా సమాధానం చెప్పారు. మరీ ఆ నటీ నటులు ఎవరైతే బాగుంటుందో జక్కన్నే చెబితే ఇంకా బాగుండేది!

 

Watch Video:

 

28696

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top