ఐఐటీ కాలేజీల్లో టాప్ మద్రాస్

ఇండియాలో విద్యార్థుల జీవితకాలపు కల ఐఐటీ సీట్ సాధించాలని . ప్రపంచంలోనే ఇంజనీరింగ్ ..మేనేజ్ మెంట్ రంగాలలో అత్యున్నతమైన భోదన కలిగిన విద్యాలయాలుగా భారత్ లోని ఐఐటీలు పేరొందాయి. ప్రతి ఏటా లక్షలాది మంది విద్యార్థులు ఈ కాలేజీల్లో సీట్ కోసం పోటీ పడతారు . హాజరు లక్షల్లో వుంటే సీట్లు మాత్రం అతి తక్కువగా ఉంటాయి . ఇందులో సీట్ కన్ ఫర్మ్ అయితే చాలు సమాజంలో ఎక్కడలేనంత గౌరవం . హోదా ..జీతం ..ప్రపంచాన్ని చుట్టి వచ్చే ఛాన్స్ దొరుకుతుంది . ఇందులో సీట్ దక్కించు కోవడం ఒక ఎత్తు అయితే ఆయా పేరొందిన ఐటీ కంపెనీల్లో ప్లేస్ మెంట్ అందుకోవడం ఓ స్టేటస్ . ఒక్కోసారి ఐటి దిగ్గజాలు కోట్లాది రూపాయలు ఆఫర్ చేస్తాయి . అది ఆయా విద్యార్థుల అదృష్టం మీద ఆధార పడి ఉంటుంది . ప్రతి ఏటా ఇండియాలో ఇంజనీరుగా కాలేజీలు ..యూనివర్సిటీలు ..వాటి భోధన ..వసతుల కల్పన ..ఉపాధి ..తదితర వాటిపై రాంక్ లు ఇస్తాయి .

2019 -2020 సంవత్సరానికి వస్తే దేశంలో ఇంజనీరింగ్ విభాగంలో అత్యుత్తమమైన కాలేజీలను ..ఐఐటీలను ప్రకటించారు . ఈసారి ఊహించని రీతిలో టాప్ పొజిషన్ లోకి వచ్చి చేరాయి ఐఐఐటీలు . మొదటి 10 స్థానాలు ప్రకటించగా అందులో మొదటి స్థానంలో చెన్నై ఐఐటీ కాలేజ్ నిలిచింది . రెండో స్థానంలో ఢిల్లీ ఉండగా ..మూడో ప్లేస్ లో ఐఐటీ బాంబే స్థానం దక్కించుకుంది . ఇక నాలుగో స్థానంలో ఐఐటీ ఖరగ్ పూర్ ఉండగా ..ఐదో స్థానంలో ఐఐటీ కాన్పూరు , ఆరో స్థానంలో ఐఐటీ రూర్కీ , ఎదవా స్థానంలో గౌహతి , ఎనిమిదో స్థానంలో ఐఐటీ హైదరాబాద్ , తొమ్మిదో స్థానంలో అన్నామలై యూనివర్సిటీ , పదవ స్థానంలో నిట్ తిరుచురాపల్లి నిలిచాయి .

గతంలో ఐఐటీ ఢిల్లీ తో పాటు ఐఐటీ ఖరగపూర్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేవి . ఇప్పుడు స్థానాలు మారడంతో విద్యార్థులు మరోసారి ఈ అత్యుత్తమమైన కాలేజీలపై కన్నేశారు . ఏ కాలేజీలో చదివితే ఎలాంటి అవకాశాలు పొందవచ్చో ఇప్పటినుంచే అంచనాలకు వచ్చేశారు . ఇటీవలే ఆయా ఐఐటీ కాలేజీల్లో సీట్లు పొందేందుకు దేశ వ్యాప్తంగా జాయింట్ ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్ (జేఈఈ ) రెండు సార్లు నిర్వహించారు . సీట్లు కేటగిరీల వారీగా వీటిని కేటాయించ నున్నారు . మెయిన్స్ లో వచ్చిన రాంక్ ల ఆధారంగా మళ్ళీ అడ్వాన్స్ ఎగ్జామ్ కు పిలుస్తారు .

అందులో వచ్చిన రాంక్ ల మేరకు ఈ ఐఐటీ కాలేజీల్లో సీట్లు ..కోర్సుల వారీగా కేటాయిస్తారు. ఒకసారి ఇందులో ప్రవేశిస్తే జీవితం సెటిల్ అయినట్టే. అనుభవం కలిగిన అధ్యాపకులు ..ప్రాక్టికల్స్ ..కాంటీన్ ఫెసిలిటీ . సీనియర్స్ సూచనలు ..సలహాలు ..కొత్తగా చేరే విద్యార్థులకు అందుతాయి . ఏ కాలేజీలకు లేనంత డిమాండ్ వీటికి ఉంది. వందకు వంద శాతం ప్లేస్మెంట్ ఉండటం వీటి ప్రత్యేకత . టెక్నాలజీ మారుతోంది ..అందుకు ఎప్పటికప్పుడు అప్ డేట్ కావడం ..అవకాశాలను పట్టుకోవడం ..విద్యార్థుల ముందున్న సవాల్ . కల కూడా ..

Comments

comments

Share this post

scroll to top