ఉద్యోగం కోసం ఫ్లిప్‌కార్ట్‌లో తనను తానే అమ్మకానికి పెట్టుకున్న IIT గ్రాడ్యుయేట్..!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేయాలంటే ఏ నిరుద్యోగి అయినా ఏం చేస్తాడు? ఆ ఉద్యోగానికి తగినట్టుగా విద్యార్హతలను సాధించి, అన్ని కోర్సులల్లో శిక్షణ పొంది తనకు నచ్చిన సంస్థకు జాబ్ కోసం అప్లికేషన్ పెట్టుకుని, ఇంటర్వ్యూలు, పరీక్షలు వగైరాలు పూర్తి చేసి ఎట్టకేలకు జాబ్ సాధిస్తాడు. కానీ ఓ యువకుడు మాత్రం ఇందుకు భిన్నంగా ఓ ఈ-కామర్స్ సైట్‌లో జాబ్ కోసం ఆ సైట్‌లోనే తనను తాను అమ్మకానికి పెట్టుకుని సంచలనం సృష్టించాడు. అయితే చివరికి ఏం జరిగింది? తెలుకుందాం రండి.
ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఓషియన్ ఇంజినీరింగ్, నావల్ ఆర్కిటెక్చర్‌లలో బీటెక్, ఎంటెక్ విద్యలను అభ్యసించిన ఆకాష్ నీరజ్ మిట్టల్ అనే యువకుడు ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో జాబ్ కోసం ఆ సైట్‌లో తనను తానే ఇటీవలే అమ్మకానికి పెట్టుకున్నాడు. తన విద్య, ఇతర అర్హతలు, నైపుణ్యాలు తదితర వివరాలన్నింటితోపాటు తన ఫొటోలు కొన్నింటినీ సైట్‌లోకి అప్‌లోడ్ చేసి, తన విలువ 27 లక్షల 60వేల 200 రూపాయలని ఆసక్తి ఉన్న వారు తనను కొనుగోలు చేయవచ్చని అమ్మకానికి పెట్టుకున్నాడు.
natakam
తన ఎత్తు, బరువు, పుట్టిన తేదీ, ఫోన్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ, మాట్లాడే భాషలు, హాబీలు తదితర వ్యక్తిగత సమాచారాన్నంతా సదరు అమ్మకానికి చెందిన పోస్ట్‌లో పేర్కొన్నాడు. అయితే ఆకాష్ నీరజ్ చేసిన ఈ ట్రిక్ దేశవ్యాప్తంగా వార్తల్లోకెక్కినా అది తనకు ఫ్లిప్‌కార్ట్‌లో జాబ్ మాత్రం ఇప్పించలేకపోయింది. ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధులు ఈ విషయంపై స్పందించలేదు సరికదా ఆకాష్ నీరజ్ చేసిన ఈ ప్రయత్నం అందరికీ నవ్వు తెప్పించింది కూడా. జాబ్ కావాలంటే రెజ్యూమ్ పంపి ప్రయత్నించాలి కానీ ఎవరైనా తనను తానే ఇలా అమ్ముకుంటారా? అంటూ కొంతమంది సోషల్ సైట్లలో కామెంట్లు కూడా చేశారు. ఏది ఏమైనా ఆకాష్ నీరజ్ చేసిన ఈ ట్రిక్ భలేగా ఉంది కదూ!
835121972

Comments

comments

Share this post

scroll to top