ఫ్రీనే క‌దా అని వాడేసారో ఇక అంతే సంగ‌తులు..

ఫ్రీ ఫ్రీ ఫ్రీ.. ఇప్పుడు ఎక్క‌డ చూసిన ఇదే మాట వినిపిస్తుంది. వాట్సాప్ ఓపెన్ చేస్తే చాలు ఇలాంటి ఉచితం సందేశాలు ద‌ర్శ‌న‌మిస్తునే ఉంటాయి. ఇది స‌రి కొత్త యాప్ డౌన్ లోడ్ చేసుకున్నారో ఏడాదంతా టాక్ టైమ్ ఫ్రీ అంటు ఓ సందేశం.. అంత‌లోనే ఈ లింక్ ను ప‌ది మందికి షేర్ చేయండి మీ బ్యాలెన్స్ లో 500 రూపాయ‌లు క్రెడిట్ అవుతాయంటూ మ‌రో మెసేజ్.. యాఫిల్ ఫోన్ కేవ‌లం 1 రూపాయికే సొంతం చేసుకోవ‌చ్చు.. ఇక్క‌డ క్లిక్ చేస్తే చాలు అంటూ మ‌రో సందేశం ఇలా ఫ్రీ ఆఫ‌ర్ మెసేజ్ లో ఊరిస్తుంటాయి. పొరపాటును ఉచిత‌మ‌ని వాటి జోలికి వెళ్లారో ఇక మీ కొంప కొల్లేరే అంటున్నారు సైబ‌ర్ నిపుణులు. జాగ్ర‌త్త‌గా ఉండ‌క పోతే తిప్ప‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రిస్తున్నారు.

ఇప్పుడంతా టెక్నాలిజి యుగం.. చేతిలో స్మార్ట్ ఫోన్ లేకుంటే గిల్టిగా ఫీల‌య్యే రోజులివి. ఇక వాట్సాప్, ఫేస్ బుక్ ల విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప వ‌లసిన అవ‌స‌రం లేదు. అయితే టెక్నాలిజి అభివృద్ది చెందుతున్న ఈ రోజుల్లో స‌మ‌స్య‌లు కూడా అంతే వేగంగా పుట్టుకొస్తున్నాయి. సైబ‌ర్ ప్ర‌పంచంలో కేటుగాళ్లు తిష్ట వేసి కూచుంటున్నారు. లింకుల‌తో డుంకీలు కొట్టిస్తు అందిన కాడికి దోచుకునేందుకు సిద్ద‌మ‌య్యారు. ఇక నోట్ల‌ర‌ద్దుతో ప్ర‌భుత్వాలు సైతం ఆన్ లైన్ బ్యాంకిగ్ కే మెగ్గు చూపుతోంది. దీంతో సైబ‌ర్ మోస‌గాళ్లు మ‌రింత రెచ్చిపోయే అవ‌కాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఎప్ప‌టి క‌ప్పుడు జాగ్ర‌త్త‌గా ఉండ‌క పోతే మొద‌టికే మోసం వ‌చ్చే అవ‌కాశాలు లేక‌పోలేదంటున్నారు. సేప్టి లేని లింకుల‌ను క్లిక్ చేయ‌డం ద్వారా.. ఫోన్ లో వాటికి సంబందించిన యాఫ్ ల‌ను సేవ్ చేసుకోవ‌డం ద్వారా మీరు చేసే ప్ర‌తి ఒక్క ప‌ని హ్య‌కర్స్ కి చేరిపోతుంద‌ని చెపుతున్నారు. మీ కాల్ రికార్స్డ్, మీ ప‌ర్స‌న‌ల్ డిటేల్స్, ఫోటోలు, మీకు సంబందించిన కీల‌క డేటా హ్య‌క‌ర్ కు చేరిపోతుంది. దీంతో మీ ఆన్ లైన్ ట్రాన్ సాక్స‌న్స్ ల‌పై క‌మాండ్ కంట్రోల్ హ్య‌క‌ర్ల చేతిలో ఉంటుంద‌ని.. మీకు సంబందించిన ఆన్ లైన్ లావ‌దేవిల‌ను మీ ప్ర‌మేయం లేకుండానే ద‌ర్జాగా చేసుకుంటార‌ని ఆన్ లైన్ నిపుణులు చెపుతున్నారు. అలాంటి ఇబ్బందులు జ‌ర‌గ‌కుండా ఉండాలంటే ఎలా న‌డుచుకోవాలో తెలుసుకుందాం..

social_media_strategy111-1024x683

     ఇలా చేయ‌కూడదు..

 • మార్కెట్లో, మీడియాలో క‌నిపంచే ప్రతి అప్లికేషన్‌ (యాప్‌)ను డౌన్‌లోడ్‌ చేసుకోకూడదు.
 • అనవసరమైన గేమ్స్‌, తెలియని యాప్స్‌ జోలికి అస‌లు వెళ్లకపోవటం మంచిది.
 •  గుడ్డిగా యాప్ లు డౌన్లోడ్‌ చేసుకుంటే… మన కీబోర్డు బదులు నకిలీ కీబోర్డు రీప్లేస్‌ అవుతుంది.
 • మన ఫోన్లో ఏం టైప్‌ చేసినా… కీబోర్డును ఉపయోగించి ఏం చిన్న ప‌ని చేసినా అది హ్యాకర్‌కు చేరిపోతుంది.
 • వాట్సాప్ లో ఇలాంటి వి ఎక్కువ వ‌స్తున్న‌ప్పుడు మీ మిత్రుల‌కు అలాంటి ఫోస్ట్ చేయ‌కూడ‌ద‌ని వార్నింగ్ ఇస్తే ఇంకా మంచింది.
 • వాట్సాప్ గ్రూప్ ల్లో ఇలాంటివి ఎక్కువ పంపించే వారిని రిమూవ్ చేస్తే ఉత్త‌మం.

dangerous-apps     ఇలా చేయండి..

 • అవసరమైన వాటిని (యాప్‌) ల‌ను గూగుల్‌ ప్లేలోంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
 • అలాగని గూగుల్‌ ప్లేలోనివన్నీ కూడా సురక్షితమని చెప్పలేం. అక్క‌డ కూడా జాగ్ర‌త్త అవ‌స‌రం.
 • ఏ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నా… ముందు దాని పర్మిషన్‌లను గమనించాలి. గడువును చూసుకోవాలి.
 • పర్మిషన్లలో ఎస్‌ఎంఎస్‌రీడ్‌; లొకేషన్‌ రీడ్‌; కెమెరాయాక్సెస్‌, కీబోర్డు…ఇలా ఉంటాయి.
 • మనం డౌన్‌లోడ్‌ చేసుకుంటున్న యాప్‌కు, ఈ పర్మిషన్లకు సంబంధం ఉందో లేదో చూసుకోవాలి.
 • స్టార్‌ రేటింగ్స్‌కంటే సమీక్ష(రివ్యూ)లు చూసుకుంటే కాసింత అర్థమవుతుంది.
 • కొన్నింటిలో…ఒక యాప్‌ను డౌన్లోడ్‌ చేసుకుంటే అదనంగా నాలుగైదు యాప్స్‌ వచ్చేస్తుంటాయి. అలాంటివాటి జోలికి వెళ్లకపోవటం మంచిది.
 • కొన్ని వెబ్‌సైట్లలో డౌన్‌లోడ్‌ అని రెండుమూడు బటన్‌లు కనిపిస్తుంటాయి. వాటిలో ఒకటే అసలైంది. మిగిలినవి నకిలీ. వాటిని గనక నొక్కితే… ట్రోజన్స్‌
 • మన సిస్టమ్‌, ఫోన్‌లో తిష్టవేస్తాయి. అవి ఇన్‌స్టాల్‌ చేసిన వారు మన సిస్టమ్‌ను పూర్తిగా వాడుకోవచ్చు.
 • ఫోన్‌ అయినా… డెస్క్‌టాప్‌ సిస్టమైనా… డౌన్‌లోడ్లలో జాగ్రత్తలు తీసుకుంటూ… యాంటీవైరస్‌ను ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేసుకోవటం; బలమైన ఫైర్‌వాల్స్‌ను పెట్టుకోవటం తప్పనిసరి.
 • యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేప్పుడు దాని డెవలపర్‌ ఎవరో చూడాలి. లేదంటే ఒకేలాంటివి నాలుగైదుంటాయి. అందులో ఒకటే ఒరిజినల్‌. మిగిలినవ‌న్ని నకిలీవి అని గుర్తించాలి.

ft-app-blocker

courtesy by: Eenadu

Comments

comments

Share this post

scroll to top