ఆ మహిళ అక్కడ నీరు కిందకి పోస్తుంది..అది పైకెళ్తుంది..! ఎందుకో తెలుసా.? కారణం ఇదే.!

భూమిపై ఉన్న ఏ ప్రదేశంలోనైనా ఏ వస్తువునైనా పైకి విసిరితే అది కిందకే పడుతుంది కదా. ఇక నీటినైనా పైకి విసిరినా లేదంటే ఏదైనా బాటిల్‌లాంటి దాంట్లో నుంచి పోసినా కిందకే పడుతుంది కానీ పైకి వెళ్లదు కదా. భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తి వల్లే ఇది సాధ్యమవుతుంది. అయితే ఇప్పుడు మేం చెప్పబోయే ఆ ప్రదేశంలో మాత్రం మీరు నీటిని కిందకు పోస్తే అది కిందకు వెళ్లదు. పైకి పోతుంది. అవును, మీరు విన్నది నిజమే. అయితే ఇంతకీ ఆ ప్రాంతం ఆకాశంలో ఎక్కడో ఉండి ఉంటుంది అనుకునేరు. కానే కాదు. భూమిపైనే ఉంది. అవును, కరెక్టే. ఇంతకీ ఆ ప్రాంతం ఏదంటే…

అది అమెరికాలోని హూవర్‌ డ్యామ్‌. అమెరికా రాష్ట్రాలైన నెవాడా, అరిజోనాల నడుమ ఉన్న కొలరాడో నదిపై బ్లాక్‌ కానయాన్‌లో ఈ డ్యామ్‌ను నిర్మించారు. 1931వ సంవత్సరంలో ఈ డ్యామ్‌ నిర్మాణం ప్రారంభం కాగా ఇది పూర్తి అయ్యేందుకు ఏకంగా 5 ఏళ్లు పట్టింది. ఇక ఈ డ్యామ్‌ ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన డ్యామ్ లలో ఒకటిగా పేరుగాంచింది. అయితే ఈ డ్యామ్‌ పై భాగంలో నిలుచుని అక్కడి నుంచి ఓ బాటిల్‌లో నీటిని కిందకు పోస్తే ఆ నీరు కిందకు వెళ్లదు. పైకి వెళ్తుంది. దీన్ని చాలా మంది ట్రై చేసి అదోలాంటి అనుభూతిని కూడా పొందుతుంటారు.

అయితే ఆ డ్యామ్‌పై ఇది ఎలా సాధ్యమవుతుందో తెలుసా..? డ్యామ్‌ కింది భాగంలో అధిక పీడనంతో ఉండే గాలి పైకి వస్తుంటుంది. దీంతో డ్యామ్‌ పై నుంచి కిందకు పడే వస్తువులు ఆ గాలి ప్రభావం వల్ల పైకి వెళ్తాయి. అందుకనే అవి కింద పడవు. అందులో భాగంగానే నీరు కూడా పైకి వెళ్తుంది తప్ప కిందకు పడదు. అదీ.. ఇందులో ఉన్న విశేషం. కావాలంటే పైన ఇచ్చిన వీడియోలో ఆ విషయాన్ని మీరే స్వయంగా తెలుసుకోవచ్చు..! ఏది ఏమైనా ఈ డ్యామ్‌ భలే వింతగా ఉంది కదా..!

Planet Earth India

Posted by India First on Friday, 12 January 2018

Comments

comments

Share this post

scroll to top