ప్ర‌తి చిన్న విష‌యానికి టెన్ష‌న్ ప‌డుతున్నారా..? ఈ 3 సూచ‌న‌లు పాటిస్తే టెన్ష‌న్ ఇట్టే త‌గ్గిపోతుంది..!

మ‌నుషుల‌న్నాక అంద‌రూ ఒకేలా ఉండ‌రు. ఒక్కొక్క‌రిదీ ఒక్కో ర‌క‌మైన మ‌న‌స్త‌త్వం అయి ఉంటుంది. కొంద‌రు ఎప్పుడూ సంతోషంగా ఉంటే, ఇంకొంద‌రు ఎప్పుడూ ఏదో పారేసుకున్న‌ట్టు ఉంటారు. ఇంకా కొంద‌రు ఎల్ల‌ప్పుడూ ఏదో ఒక‌టి ఆలోచిస్తూ చాలా విచారంగా ఉంటారు. ఇక మ‌రికొంద‌రైతే ప్ర‌తి చిన్న విష‌యానికి టెన్ష‌న్ ప‌డుతుంటారు. ఏదైనా ప‌ని అనుకుంటే అది ఎలా జ‌రుగుతుందోన‌ని, భవిష్య‌త్తు ఎలా ఉంటుందోన‌ని నిత్యం ఆందోళ‌న చెందుతుంటారు. అయితే ఇలాంటి మ‌న‌స్తత్వం మాత్రం ఎవ‌రికీ ఉండ‌కూడ‌దు. అలా ఉంటే ఒత్తిడి, ఆందోళ‌న‌ల‌తోనే జీవితం గ‌డుస్తుంది. ఇలాంటి వారు ఎప్పటికీ హ్యాపీగా ఉండ‌లేరు. మ‌రి ఇలాంటి వారు టెన్ష‌న్‌ను త‌గ్గించుకోవాలంటే ఏం చేయాలి..? అందుకు కింద ఇచ్చిన సూచ‌న‌లు పాటించాలి.

1. ప్ర‌తి చిన్న విష‌యానికి ఆందోళ‌న పడే వారు ముందుగా త‌మ‌కు ఏ అంశం ప‌ట్ల ఆందోళ‌న ఉందో బుక్‌లో రాసుకోవాలి. ఉదాహ‌ర‌ణ‌కు ఒక పార్టీ అరేంజ్ చేస్తున్నారనుకుందాం. అప్పుడు ఇలాంటి వారు దాని గురించే ఆలోచిస్తూ టెన్ష‌న్ ప‌డుతుంటారు. పార్టీ ఎలా జ‌రుగుతుంది..? ఏవైనా ఇబ్బందులు వ‌స్తాయా..? గెస్ట్‌లు తృప్తి చెందుతారా..? లేదంటే ఇబ్బందులు వ‌స్తాయేమో..? అని ఆలోచిస్తూ టెన్ష‌న్ పెట్టుకుంటారు. అలాంటి స్థితిలో ఉన్న‌వారు త‌మ‌కు ఉన్న టెన్ష‌న్ ఏమిటో రాయాలి. ఏయే అంశాల వ‌ల్ల టెన్ష‌న్ నెల‌కొంటుందో రాయాలి. దీని వ‌ల్ల స‌గం వ‌ర‌కు టెన్ష‌న్ ఇట్టే త‌గ్గిపోతుంది. ప‌లువురు సైంటిస్టులు దీన్ని ప్ర‌యోగాత్మ‌కంగా రుజువు చేశారు కూడా.

2. ఆందోళ‌న త‌గ్గించుకునేందుకు ఉపయోగ‌ప‌డే రెండో అంశం మెడిటేష‌న్‌. బాగా టెన్ష‌న్‌లో ఉన్న‌ప్పుడు ఏకాంతంగా కొంత‌సేపు మెడిటేష‌న్ చేయాలి. చుట్టూ ఎలాంటి సౌండ్స్ లేకుండా ప్ర‌శాంతంగా ఉండే వాతావ‌ర‌ణంలో క‌నీసం 30 సెకండ్ల నుంచి 2 నిమిషాల పాటు చాలా త‌క్కువ స‌మ‌యం మెడిటేష‌న్ చేసినా ఫ‌లితం ఉంటుంది. ఆందోళ‌న బాగా త‌గ్గుతుంది.

3. టెన్ష‌న్‌లో ఉన్న‌ప్పుడు వ్యాయామం చేసినా ఫ‌లితం ఉంటుంది. వ్యాయామం వ‌ల్ల మెద‌డు షార్ప్‌గా మారుతుంది. దీంతో మూడ్ లో మార్పు వ‌స్తుంది. త‌ద్వారా టెన్ష‌న్ త‌గ్గుతుంది. వాకింగ్‌, ర‌న్నింగ్‌, జాగింగ్‌, ఎరోబిక్స్‌, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలు ఏవి చేసినా చాలు. ఫ‌లితం ఉంటుంది.

Comments

comments

Share this post

scroll to top