మనం తినే ఆహారం ఏదైనా దాని ద్వారా మనకు అందే శక్తి క్యాలరీల రూపంలోనే ఉంటుంది. నిర్దిష్టమైన ఆహార పదార్థాలను నిర్దిష్టమైన మొత్తంలో తింటే తద్వారా మనకు నిర్దిష్టమైన క్యాలరీలు లభిస్తాయి. అంటే ఒక కోడిగుడ్డు తింటే 80 క్యాలరీలు, ఒక చపాతీకి 60 క్యాలరీలు, ఒక కప్పు రైస్‌కు 120 క్యాలరీలు, ఒక కప్పు టీ కి 50 క్యాలరీలు… ఇలా రక రకాల ఆహార పదార్థాల ద్వారా మనకు క్యాలరీలు లభిస్తాయి. అయితే అవి మన శరీరంలో ఖర్చయితే ఓకే. లేదంటే అవి కొవ్వు కింద మారుతాయి. ఈ క్రమంలో ఆ క్యాలరీలను కరిగించాలంటే వ్యాయామాలు చేయడం తప్పనిసరి. అయితే కేవలం వ్యాయామాలు మాత్రమే కాదు, కింద చెప్పిన పలు రకాల పనులకు కూడా క్యాలరీలు కరుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. మీరు బాత్ రూం సింగరా..? స్నానం చేసేటప్పుడు పాటలు పాడుతుంటారా..? అయితే అలా చేయడం వల్ల 10 నుంచి 20 క్యాలరీలు ఖర్చవుతాయి.
2. స్త్రీ, పురుషులు ఎవరిలోనైనా, ఏ సందర్భంలోనైనా నిపుల్స్ గట్టి పడితే అప్పుడు 3 నుంచి 6 క్యాలరీలు కరుగుతాయట.
3. కేవలం 10 నిమిషాల పాటు బిగ్గరగా నవ్వినా కూడా 20 నుంచి 30 క్యాలరీల వరకు ఖర్చు అవుతాయి. అంతేకాదు, ఒత్తిడి, ఆందోళన వంటివి దూరమవుతాయి.
4. రెండు నిమిషాల పాటు బ్రష్ చేస్తే 6 నుంచి 8 క్యాలరీలు ఖర్చు అవుతాయి.
5. గంట సేపు ఎవరినైనా కౌగిలించుకుంటే అప్పుడు 70 క్యాలరీల వరకు ఖర్చవుతాయి.
6. చెవులకు ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని సంగీతం వింటున్నప్పుడు తలను అటు ఇటు ఊపడం వల్ల 4 నిమిషాలకు గాను 30 క్యాలరీల వరకు ఖర్చు చేయవచ్చట.
7. ఒక్క నిమిషం పాటు ముద్దు పెట్టుకున్నా 5 క్యాలరీల వరకు ఖర్చు చేయవచ్చు.
8. ఒక గంట సేపు చూయింగ్ గమ్‌ను నమిలితే 9 నుంచి 12 క్యాలరీల వరకు ఖర్చు చేయవచ్చు.
9. కుక్కతో 20 నిమిషాల పాటు వాకింగ్ చేయిస్తే 60 క్యాలరీల వరకు ఖర్చు అవుతాయి.
10. గంట సేపు ఎవరితోనైనా ఫోన్లో టెక్ట్స్ మెసేజ్‌ల ద్వారా చాటింగ్ చేస్తే అప్పుడు 40 క్యాలరీల వరకు ఖర్చు అవుతాయి.
11. డిన్నర్ పార్టీలో టేబుళ్లను సెట్ చేయడం, ఫుడ్ సర్వ్ చేయడం వంటి పనులు చేస్తే అరగంటకు 80 క్యాలరీల వరకు ఖర్చు అవుతాయి.
12. పిల్లలతో 20 నిమిషాల పాటు ఆడుకుంటే 80 క్యాలరీల వరకు ఖర్చు అవుతాయి.