వివాహం ఆలస్యం అవుతుందా? 8 మంగళవారాలు ఇలా చేస్తే త్వరగా వివాహం అవుతుంది.!

వివాహం అనేది ప్రతి మనిషికి జీవితంలో చాలా ముఖ్యమైనది. దాదాపుగా ఎవరికైనా జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే శుభ సందర్భం అది. అలాంటి సమయంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, తెలిసిన వారు వివాహ వేడుకకు వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అలాంటి శుభ సందర్భం మళ్లీ మళ్లీ రాదు. అయితే చాలా మందికి సరైన సమయంలో పెళ్లిళ్లు అవుతాయి. ఇక కొందరికి కొంచెం అటో, ఇటో సమయం ఎక్కువైనా, తక్కువైనా పెళ్లి జరుగుతుంది. కానీ కొందరికి మాత్రం వివాహం అస్సలు కాదు. అందుకు అనేక కారణాలు ఉంటాయి. కొందరికి అసలు ఏ సమస్యా లేకున్నా వివాహం కాదు. అందుకు కారణాలు ఏంటో కూడా తెలుసుకోలేకపోతారు. అయితే ఇలాంటి వారు కింద చెప్పిన విధంగా చేస్తే దాంతో వారికి త్వరగా వివాహం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. మరి వారు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా…

వివాహం అస్సలు కావడం లేదని బాధపడేవారు ఆంజనేయ స్వామిని పూజించాలి. ప్రతి మంగళవారం 108 తమలపాకులతో ఆయనకు పూజ చేయాలి. ఇలా 8 మంగళవారాల పాటు చేయాలి. దీంతో ఆయన అనుగ్రహం లభిస్తుంది. త్వరగా వివాహం అవుతుంది.

శని దోషం కారణంగా వివాహం ఆలస్యం అవుతుంది అనుకున్న వారు అందుకు ఇలా చేయాలి. వారు తమలపాకుల్లో తేనె పోసి అనంతరం వాటిని చీమలకు ఆహారంగా పెట్టాలి. దీంతో దోషం నివారణ అవుతుంది. ఫలితంగా వివాహం త్వరగా అవుతుంది.

ఇక పైన చెప్పిన వాటితోపాటు కింద ఇచ్చిన మంత్రాన్ని ప్రతి రోజు 108 సార్లు పారాయణం చేయాలి. దీంతో ఇతర ఏవైనా దోషాలు ఉంటే అవి పోతాయి. వివాహానికి ఉండే అడ్డంకులు తొలగిపోయి త్వరగా వివాహం జరుగుతుంది. ఇక ఆ మంత్రం ఏమిటంటే…

”దేవీంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభాషిణి సర్వసౌభాగ్య కార్యేషు సర్వ సౌభాగ్య దాయినీ”

పైన చెప్పిన మంత్రాన్ని రోజూ 108 సార్లు పఠించాలి. అనుకున్న ఫలితం త్వరగా కలుగుతుంది.

Comments

comments

Share this post

scroll to top