ఆ పార్క్ లోకి వెళ్లాలంటే బట్టలు విప్పాల్సిందే….వింత పార్క్‌పై కథనం ప్రత్యేకమైన కథనం,

ఉదయం నుంచి పనిలో అలసిపోయి సాయంత్రం కాగానే సేద తీరుదామని పార్కులకు వెళ్తారు. కొన్ని పార్కులకు అయితే ఫ్రీ ఎంట్రన్స్ ఉంటుంది… మరికొన్ని పార్కులకు అయితే డబ్బులు కట్టి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. కానీ మేము చెప్పే పార్కులోకి ఎంటర్ అవ్వాలంటే భారీ మొత్తంలో ఎంట్రీ ఫీజ్ కట్టి పూర్తి నగ్నంగా పార్కులోకి అడుగుపెట్టాల్సి ఉంటుంది. ఎక్కడ ఆ పార్క్ అనుకుంటున్నారా…. అయితే డైరెక్ట్ గా విషయంలోకి వచ్చేద్దాం….


అర్ధనగ్న నత్యాలతో కనువిందు చేసే కార్నివాల్‌ డ్యాన్సర్లకు ప్రసిద్ధి చెందిన బ్రెజిల్‌లో కొత్తగా సెక్స్‌ థీమ్‌ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో మొత్తం శృంగారాన్ని ప్రేరేపించే విధంగా పార్కును అభివృద్ధి చేస్తున్నారు. ఈ పార్కుకు ఎరోటికా ల్యాండ్ అని పేరు పెట్టింది బ్రెజిల్ ప్రభుత్వం.
ప్రపంచంలో ఇలా తొలి శృంగార పార్కును ఏర్పాటు చెయ్యడం ఇదే తొలిసారి. వచ్చిన వారిని ఆకట్టుకునేందుకు ఇక్కడ అన్ని శృంగార క్రీడలనే ఏర్పాటు చేసారు. స్విమ్మింగ్‌పూల్‌లో నగ్నంగానే ఈత కొట్టాలి, ఎమ్యూజ్‌మెంట్‌ పార్క్‌లో కూడా నగ్నంగానే తిరగాలి. ఇక, ఇక్కడ ఉండే శిల్పాలన్నీ శృంగార భంగిమల్లోనే ఉంటాయి. ఇక్కడి రెస్టారెంట్‌లలో దొరికే ఆహారం, పానియాలు కూడా కామోద్రేకాన్ని కలిగించేవిగా ఉంటాయి.
అయితే ఇక్కడ బహిరంగ శృంగారం మాత్రం నిషిద్ధం. సెక్స్‌లో పాల్గొనాలని నిర్ణయించుకున్న జంటలు ఇదే థీమ్‌ పార్క్‌లో ఉండే హోటల్‌ గదులను అద్దెకు తీసుకోవాల్సి ఉంటుంది. వైబ్రేషన్‌ కలిగించే ‘7డి’ థియేటర్, సెక్స్‌ షాప్‌ సౌకర్యాలు ఉంటాయి. గోగో గర్ల్స్, బాయ్స్‌ (రేవ్‌ పార్టీల్లో నృత్యం చేసేవారు) కూడా ఉంటారు.

సావో పావులోకి రెండు గంటల ప్రయాణ దూరంలోని పిరాసికబా నగరానికి సమీపంలో నిర్మిస్తున్న ఈ థీమ్‌ పార్క్‌ త్వరలో ప్రారంభం కానుంది. దాపు 22.4 మిలియన్ డాలర్ల ఖర్చుతో (దాదాపు 159 కోట్ల రూపాయలు) దీన్ని నిర్మించారు. ఈ పార్కు ఓపెన్ అయితే… జనాల్లో విచ్ఛలవిడితనం పెరిగిపోతుందని కొందరు సాంప్రదాయ వాదులు వాదిస్తున్నారు. ఇలా సెక్స్ గేమ్స్ కారణంగా లైంగిక కోరికలు హెచ్చుమీరిపోతున్నాయని వాపోతున్నారు.

 

Comments

comments

Share this post

scroll to top