ఏయే లోహంతో చేసిన ప్లేట్‌లో తింటే ఎలాంటి అనారోగ్యాలు న‌య‌మ‌వుతాయో తెలుసా..?

ఇప్పుడంటే మ‌నం స్టీల్‌, పింగాణీ, ప్లాస్టిక్ వంటి పదార్థాల‌తో చేసిన ప్లేట్ల‌లో భోజనం చేస్తున్నాం. కానీ ఒక‌ప్పుడు మ‌న పూర్వీకులు ఎక్కువ‌గా అరిటాకు భోజ‌నం చేసే వారు. అది కుద‌ర‌క‌పోతే ఇంట్లో ఉన్న ఇత్త‌డి, వెండి వంటి లోహాల‌తో చేసిన ప్లేట్ల‌ను భోజ‌నానికి ఉప‌యోగించేవారు. అయితే నిజానికి వారు ఇలా ఆయా లోహాల‌తో చేసిన ప్లేట్ల‌లో భోజ‌నం చేయ‌డం వెనుక ఆరోగ్య ర‌హ‌స్యం దాగి ఉంది తెలుసా..? అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

gold-silver-plates

బంగారం, వెండి లేదా ఇత్త‌డి వంటి లోహాల‌తో చేసిన ప్లేట్ల‌లో భోజ‌నం చేస్తే ఆరోగ్యం క‌లుగుతుంద‌ని ఆయుర్వేదం చెబుతోంది. ఈ క్ర‌మంలో ఏయే ప్లేట్ల‌లో తింటే మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. బంగారంతో చేసిన ప్లేట్ల‌లో తినే వారికి ఎలాంటి వ్యాధులు రావ‌ట‌. వారు ఆరోగ్యంగా ఉంటార‌ట‌. ఉన్న రోగాల‌న్నీ హ‌రించుకుపోతాయ‌ట‌.

2. వెండితో చేసిన ప్లేట్ల‌లో భోజ‌నం చేస్తే నేత్ర సంబంధ వ్యాధులు రావ‌ట‌. దృష్టి చ‌క్క‌గా ప‌నిచేస్తుంద‌ట‌. అంతేకాదు వీరికి జీర్ణాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు కూడా ఉండ‌వ‌ట‌.

brass-plates

3. ఇత్త‌డితో చేసిన ప్లేట్ల‌లో తిన‌డం వ‌ల్ల జీర్ణాశ‌యంలో ఉన్న క్రిములు న‌శిస్తాయి. దీంతో జీర్ణాశ‌యం శుభ్ర‌మ‌వుతుంది. ఇది శ్వాస కోశ వ్యాధుల‌ను న‌యం చేస్తుంది. శ‌రీరానికి బ‌లం చేకూర్చుతుంది.

4. పైన చెప్పిన వాటితోపాటు రాగితో చేసిన చెంబులు, గ్లాసుల్లో నీరు తాగితే దాంతో ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లున్నా ఇట్టే పోతాయి. అందుకే మ‌న పూర్వీకులు ఎక్కువ‌గా ఈ లోహాల‌తో చేసిన పాత్ర‌ల‌నే వంట‌ల‌కు కూడా ఉప‌యోగించేవారు. అయితే అవి ఇప్పుడు క‌నుమ‌రుగ‌య్యాయి.

Comments

comments

Share this post

scroll to top