మీ ఫ్రెండ్స్‌తో స్నేహం క‌ల‌కాలం ఉండాల‌ని కోరుకుంటున్నారా..? అయితే ఈ 6 త‌ప్పులు చేయ‌కూడ‌దు..!

సృష్టిలో ఉన్న మ‌నుషులంద‌రి మ‌ధ్య ఉండే సంబంధాల్లో స్నేహానికి చాలా ప్రాధాన్యత ఉంది. సొంత కుటుంబ స‌భ్యుల‌తో చెప్ప‌లేని, పంచుకోలేని ఎన్నో విష‌యాల‌ను చాలా మంద స్నేహితుల‌తో షేర్ చేసుకుంటారు. ఎందుకంటే ఆ బంధానికి అంత విలువ ఉంటుంది కాబ‌ట్టి. ఈ క్ర‌మంలో ప్ర‌తి ఏటా ఆగ‌స్టు నెల‌లో మొద‌టి ఆదివారం రోజును స్నేహితుల దినోత్స‌వంగా జ‌రుపుకుంటున్నారు కూడా. ఈ ఏడాది ఇప్ప‌టికే ఈ దినోత్స‌వాన్ని జ‌రుపుకున్నారు. అయితే ఇంత వ‌ర‌కు బాగానే ఉంది, కానీ మీ వ‌ల్ల జ‌రిగే కొన్ని వాస్తు దోషాలు, త‌ప్పుల వ‌ల్ల మీ ఫ్రెండ్స్‌తో మీకు ఉన్న ఫ్రెండ్‌షిప్ క‌ట్ అయ్యేందుకు అవ‌కాశం ఉంటుందని తెలుసా..? అవును, వాస్తు దోషం ఉన్నా అది ఆ ఇంట్లో ఉండే వ్య‌క్తి స్నేహితుల‌పై ప‌డుతుంది. మ‌రి ఆ దోషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. మెయిన్ గేట్
ఇంటి మెయిన్ గేట్ ప‌రిస‌రాలు చాలా శుభ్రంగా ఉండాలి. లేదంటే అది వాస్తు దోషాన్ని కలిగిస్తుంది. దీంతో ఆ ఇంట్లో ఉండే వ్య‌క్తులకు స్నేహితులు దూర‌మ‌వుతారు. వారి ఫ్రెండ్ షిప్ క‌ట్ అవుతుంది. క‌నుక ఇంటి ప్ర‌ధాన గేట్ ను, దాని పరిస‌రాల‌ను ఎల్ల‌ప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా గేట్‌పై దుస్తులు ఆరేయ‌రాదు. ఎలాంటి వస్తువుల‌ను పెట్ట‌రాదు, త‌గిలించ‌రాదు.

2. ఆహారం
చాలా మంది స్నేహితులు ఏం చేస్తారంటే ఎవ‌రైనా ఫుడ్ తింటుంటే వారి ప్లేట్ లోంచి ఆ ఫుడ్‌ను లాక్కుని తింటారు. కొంద‌రు మామూలుగానే ప్లేట్‌లో ఉన్న ఆహారాన్ని తీసుకుని తింటారు. అయితే నిజానికి ఇలా రెండు ర‌కాలుగా కూడా చేయ‌కూడ‌ద‌ట‌. ఫ్రెండ్స్ ఎవ‌రైనా ఒక‌రి ప్లేట్ లో ఉన్న ఆహారాన్ని మ‌రొక‌రు తీసుకుని తిన‌కూడ‌ద‌ట‌. కేవ‌లం కుటుంబ స‌భ్యులు మాత్ర‌మే ఆ ప‌ని చేయాల‌ట‌. అలా కాకుండా ఫ్రెండ్స్ చేస్తే వారి ఫ్రెండ్ షిప్ క‌ట్ అయ్యేందుకు అవ‌కాశం ఉంటుంద‌ట‌.

3. ఇంటి పై భాగం
ఇంటి పై భాగం (డాబా)పై ఎలాంటి వ‌స్తువులు (పాతవైనా, కొత్త‌వైనా, పాడైన‌వైనా) ఉంచ‌రాద‌ట‌. ఉంచితే అవి వాస్తు దోషాన్ని క‌ల‌గ‌జేస్తాయ‌ట‌. దీంతో ఆ ఇంట్లో ఉండే వారి ఫ్రెండ్స్‌తో వారి ఫ్రెండ్‌షిప్ క‌ట్ అయిపోతుంద‌ట‌.

 

4. ప‌ర్‌ఫ్యూమ్‌
ప‌ర్‌ఫ్యూమ్‌ల‌ను స్నేహితులు ఒక‌రికొక‌రు గిఫ్ట్‌లుగా ఇచ్చుకోరాద‌ట‌. అలా ఇచ్చుకుంటే వారి స్నేహం చెడిపోతుంద‌ట‌. వారి రిలేష‌న్ క‌ట్ అవుతుంద‌ట‌.

5. న‌లుపు రంగు దుస్తులు
స్నేహితులెవ‌రైనా ఒక‌రికొక‌రు న‌లుపు రంగు దుస్తుల‌ను బ‌హుమ‌తులుగా ఇచ్చుకోకూడ‌ద‌ట‌. ఇచ్చుకుంటే వారి ఫ్రెండ్ షిప్‌కు ప్ర‌మాదం ఏర్ప‌డుతుంద‌ట‌.

6. అప్పు తీసుకోవ‌డం
శ‌నివారం రోజున ఫ్రెండ్స్ ఎవ‌రైనా ఒకరినుంచి ఒక‌రు డ‌బ్బు లేదా ఇత‌ర వ‌స్తువులు అప్పుగా, బ‌దులుగా తీసుకోకూడ‌ద‌ట‌. తీసుకుంటే వారి స్నేహం ఎక్కువ రోజులు సాగ‌ద‌ట‌.

Comments

comments

Share this post

scroll to top