నన్ను పాస్ చెయ్యండి… అంటూ 10 తరగతి ఎగ్జామ్ లో దిమ్మతిరిగే సమాధానం రాసిన విద్యార్ధి!!

ప్రశ్న పత్రంలోని ప్రశ్నలకు సమాధానాలు దొరకకపోతే సినిమా కథలు రాయడమూ… లేక పాటలు రాయడమో చేస్తుంటారు. మరి కొంత మంది ప్రశ్నా పత్రాన్నే తిప్పి తిప్పి రాస్తుంటారు. మరి కొందరు ఆన్సర్ షీట్ లో డబ్బులు పెడతారు. మరికొంత మంది పాస్ చేయించి ఈ నెంబర్ కు కాల్ చేస్తే డబ్బులు పంపుతామంటూ ఫోన్ నెంబర్లు రాస్తారు. ఇలా ఎవరికి నచ్చినట్టు వారు రాస్తుంటారు.

ఉత్తర భారత దేశంలో పదో తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. ఇప్పుడు ఆ సమాధాన పత్రాల మూల్యాంకన జరుగుతోంది. అయితే అక్కడి అబ్బాయిలు మరీ దారుణంగా సమాధానాలు రాస్తున్నారట. తాజాగా ఓ అబ్బాయి రాసిన సమాధానం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సంవత్సరం అంతా చదివిన ఆ కుర్రాడు రాసిన సమాధానం చూసి అందరూ నోరు వెళ్లబెడుతున్నారు.

ఇంతకు ఆ కుర్రాడు పరీక్షలో ఏం రాశాడో తెలుసా… నన్ను పాస్‌ చేయండి, నన్ను పాస్‌ చేస్తే నాకు ఉన్న స్థలం మీకు రాసిస్తాను, అలాగే మా అక్కను మీరు పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకుంటాను అలా మీరు నాకు బావ అవ్వొచ్చు, లేదంటే మీ చెల్లిని నేను పెళ్లి చేసుకుంటాను, అందువల్ల మీరు నాకు బావమర్ది అవ్వొచ్చు. ఇందులో ఏదైనా నాకు సమ్మతమే. మీకు సమ్మతమే అయితే పాస్‌ చేయండి అంటూ సమాధాన పత్రంలో రాయడం జరిగింది.

ఇంకో వ్యక్తి మీరు హనుమాన్‌ భక్తులు అయితే ఇది చూసి అయినా పాస్‌ చేయండి అంటూ హనుమాన్‌ చాలీసా మొత్తం నింపేశాడు.
మరో కుర్రాడు నీకు ప్రభుత్వం జీతం ఇస్తుంది కనుక నీవు నాకు మార్కులు ఇవ్వు అంటూ రాశాడు.

Comments

comments

Share this post

scroll to top