శత్రువుల నుండి వచ్చిన మన అభినందన్ కి ఎలాంటి కఠిన పరీక్షలు చేసారో తెలిస్తే అయ్యో పాపం అంటారు..

పాకిస్థాన్ యుద్ధ విమానాన్ని కూల్చి పాక్ కి చిక్కారు భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్. రెండు రోజుల తర్వాత పాకిస్థాన్‌ ఆర్మీ అదుపులో నుంచి స్వదేశానికి చేరుకున్నారు భారత వాయుసేన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌. అయితే అభినందన్ కి కొన్ని కీలకమైన వైద్య పరీక్షలు నిర్వహించారు. శత్రు దేశానికి చిక్కినప్పుడు కొన్ని పరిక్షలైతే కొన్ని పరీక్షలు ఖచ్చితంగా చేస్తారు.

అటారీ చేరుకున్న అభినందన్‌ను భారత వైమానిక దళానికి చెందిన ఇంటెలిజెన్స్‌ యూనిట్‌కు తరలిస్తారు. అక్కడ ఆయనకు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆయన ఫిట్‌నెస్‌ స్థాయి ఏ మేరకు ఉందనే దాన్ని పరీక్షిస్తారు. అనంతరం ఆయన శరీరంలో పాక్‌ ఆర్మీ ఏమైనా బగ్‌ను అమర్చిందా? అనేది తెలుసుకునేందుకు స్కానింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. అంతేకాదు.. ఆయన మానసిక పరిస్థితి, ఆలోచనా విధానం ఏ విధంగా ఉందో పరీక్షించారు . అభినందన్‌ నుంచి సమాచారం రాబట్టేందుకు శత్రుదేశం అతడిని టార్చర్‌ చేసిందా? అనే విషయానికి సంబంధించి వివరాలను సేకరిస్తారు. ఇంకా ఏదైనా అవసరం అనిపిస్తే ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ), రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌(రా) అధికారులు ఆయన్ను ప్రశ్నించే అవకాశం కూడా ఉంది. సాధారణంగా ఐఏఎఫ్‌ అధికారిని ఐబీ, రా అధికారులు విచారించేందుకు అనుమతి లేదు. కానీ, క్లిష్టమైన కొన్ని కేసుల్లోనే ఈ విధంగా విచారణ చేయాల్సి ఉంటుంది.

పైలట్‌ను పరీక్షించిన వైద్యులు వెన్నెముకకు గాయమైందని, పదిరోజులు విశ్రాంతి అవసరమని పేర్కొన్నారు. అలాగే, అతడి శరీరంలో ఎటువంటి బగ్స్ లేవని స్పష్టం చేశారు. అతడిలో అసాధారణ స్థితి ఏమీ లేదని వైద్యులు నిర్ధారించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇది ఇలా ఉండగా…తనను పరీక్షిస్తున్న సమయంలో డాక్టర్ల తో అభినందన తనకి ఒక కోరిక ఉందని చెప్పారు. అదేంటో తెలుస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే.

వైద్య పరీక్షలు త్వరగా పూర్తిచేసి పంపిస్తే వెంటనే విధుల్లో చేరాలనుకుంటున్నానని అభినందన్ చెప్పడంతో అక్కడే ఉన్న వైమానిక దళ అధికారులు ఆశ్చర్యపోయారట. అతడి అంకితభావానికి ఇది నిదర్శనమని కొనియాడుతున్నారు.

 

Comments

comments

Share this post

scroll to top