ఈ 9 ర‌కాల నొప్పుల్లో దేంతోనైనా మీరు బాధ‌ప‌డుతున్నారా ? అయితే మీకు క‌లిగిన అనారోగ్య స‌మ‌స్య గురించి తెలుసుకోండి.

మన దేహం అంటేనే అదొక సంక్లిష్ట‌మైన నిర్మాణం. మ‌న‌కు క‌లిగే కొన్ని అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను గుర్తించేందుకు నిజంగా డాక్ట‌ర్లు కూడా ఒక్కోసారి విఫ‌ల‌మ‌వుతుంటారు. వారికి స‌మ‌స్య అనేది తెలియ‌దు. దీంతో చికిత్స చేయ‌డం కూడా అసాధ్య‌మ‌వుతుంది. అలాగే మ‌న దేహంలో ఒక్కోసారి స‌మ‌స్య ఉన్న చోట కాకుండా వేరే భాగాల్లో దాని తాలూకు నొప్పి వ‌స్తుంది. దీంతో ఇలాంటి సంద‌ర్భాల్లోనూ అస‌లు స‌మ‌స్య‌ను క‌నిపెట్ట‌డం చాలా క‌ష్ట‌త‌ర‌మ‌వుతుంది. మ‌రి మ‌న దేహంలో ఏయే భాగాల్లో నొప్పి వ‌స్తే ఆ నొప్పి తాలూకు స‌మ‌స్య లేదా అనారోగ్యం ఏది అయి ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. గుండె
గుండె నొప్పి వ‌స్తే మ‌న శ‌రీరంలో ఛాతిలో ఎడ‌మ వైపు నొప్పి వ‌స్తుంద‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే గుండె నొప్పి వ‌చ్చిన‌ప్పుడు కొన్నిసార్లు ఆ నొప్పి వీపులో గుండెకు వెనుక వైపు కూడా వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది.

2. లంగ్ అండ్ డ‌యాఫ్రం
మెడ‌, భుజం భాగాల్లో నొప్పి వ‌స్తుంటే డాక్ట‌ర్ ను క‌ల‌వాలి. ఇది శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల వ‌చ్చే నొప్పి అయి ఉంటుంది. లేదా ఫ్రీనిక్ న‌ర్వ్ అనే ఓ నాడి వ‌ల్ల కూడా అయి ఉంటుంది.

3. లివ‌ర్‌, గాల్ బ్లాడ‌ర్
మెడ లేదా భుజాల్లో నొప్పి ఉంటే లివ‌ర్ లేదా గాల్ బ్లాడ‌ర్ స‌మ‌స్య అయి ఉంటుంది. సాధార‌ణంగా కంప్యూట‌ర్ ఎదుట ఎక్కువ సేపు కూర్చుని ప‌నిచేయ‌డం వ‌ల్ల లేదా, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల కూడా ఈ నొప్పి వ‌స్తుంటుంది. సుదీర్ఘ‌కాలం నొప్పి ఉంటే మాత్రం అనుమానించాలి. డాక్ట‌ర్‌ను క‌ల‌సి చికిత్స తీసుకోవాలి.

4. జీర్ణాశ‌యం, క్లోమం
ఛాతి మ‌ధ్య‌లో పొట్ట‌కు కొంచెంపైన లేదా స‌రిగ్గా వీపులో అదే స్థానంలో నొప్పి వ‌స్తుంటే అది జీర్ణాశ‌యం లేదా క్లోమం స‌మ‌స్య అయి ఉంటుంది. దాదాపుగా 50 శాతం మందికి క్లోమం స‌మ‌స్య ఉన్న‌వారిలో వెనుక వైపునే నొప్పి వ‌స్తుంది. ఇలా నొప్పి వ‌స్తుంటే డాక్ట‌ర్‌ను క‌ల‌సి చికిత్స తీసుకోవాలి.

5. చిన్న పేగులు
స‌రిగ్గా బొడ్డులో విప‌రీత‌మైన‌, ప‌దునైన భ‌రించ‌లేని నొప్పి వ‌స్తుంటే అది చిన్న పేగుల స‌మ‌స్య అయి ఉంటుంది.

6. అపెండిక్స్‌, పెద్ద పేగు
బొడ్డు ప‌క్క‌న కొంచెం కింద‌కు కుడి భాగంలో నొప్పి వ‌స్తే అది అపెండిసైటిస్ నొప్పి లేదా పెద్ద పేగు స‌మ‌స్య అయి ఉంటుంది. చాలా మందికి అయితే అపెండిసైటిస్ స‌మ‌స్యే వ‌స్తుంది. నొప్పి 24 గంట‌ల క‌న్నా ఎక్కువ సేపు ఉంటే వెంట‌నే ఆప‌రేష‌న్ చేస్తారు.

7. కిడ్నీ
కిడ్నీల్లో స‌మ‌స్య ఉంటే చిత్రంలో ఇచ్చిన‌ట్టుగా నొప్పి ఆ ప్రాంతంలో ఎక్క‌డైనా ఉంటుంది. వెన్ను భాగంలో కింద‌, పొట్ట‌లో, తొడ‌లు, పెల్విస్ రీజన్‌లో నొప్పి వ‌స్తుంది. నొప్పి ఎప్పుడో ఒక‌సారి వ‌స్తే ఏమీ కాదు, కానీ పోకుండా అలాగే ఉంటే డాక్ట‌ర్‌ను క‌ల‌వాలి.

8. మూత్రాశ‌యం
మూత్రాశ‌య స‌మ‌స్య‌, ఇన్‌ఫెక్ష‌న్ ఉంటే తొడ‌ల లోప‌లి వైపు నొప్పి వ‌స్తుంది. లేదా చిత్రంలో చూపిన‌ట్టుగా ముందు, వెనుక భాగాల్లో నొప్పి వ‌స్తుంది.

9. అండాశ‌యం
అంఢాశ‌య స‌మ‌స్య‌లు ఉన్న మ‌హిళ‌ల్లో బొడ్డుకు కింద కుడి, ఎడ‌మ భాగాల్లో నొప్పి వ‌స్తుంది. ఈ నొప్పి బాగా ప‌దునుగా ఉంటుంది. క‌త్తి పెట్టి కోసిన‌ట్టుగా అనిపిస్తుంది. అలా నొప్ప వ‌స్తే వెంట‌నే డాక్ట‌ర్‌ను క‌ల‌వాలి.

Comments

comments

Share this post

scroll to top