మీ చేతి మ‌ణిక‌ట్టుపై ఈ రేఖ‌లు ఉన్నాయా..? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసుకోండి..!

చేతి రేఖ‌ల‌ను బ‌ట్టి వ్య‌క్తుల వ్య‌క్తిత్వాలు, జాత‌కం, భ‌విష్య‌త్ చెప్పే శాస్త్రం గురించి మీకు తెలుసు క‌దా! అదేనండీ హ‌స్త సాముద్రికం. అవును, అదే. అర‌చేయి, మ‌ణికట్టు త‌దిత‌ర ప్రాంతాల్లో ఉన్న రేఖ‌ల‌కు అనుగుణంగా ఆయా వ్య‌క్తుల భ‌విష్య‌త్ ఎలా ఉంటుందో కొంద‌రు చెబుతారు. అయితే దీన్ని కొంద‌రు నమ్ముతారు. కొంద‌రు న‌మ్మ‌ర‌నుకోండి. అది వేరే విష‌యం. కాగా చేతి మ‌ణిక‌ట్టుపై ఉండే ప‌లు రేఖ‌ల‌ను బ‌ట్టి వ్య‌క్తుల ఆరోగ్యం ఎలా ఉంటుందో చెప్ప‌వ‌చ్చ‌ట. ఆ రేఖ‌లు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

wrist-lines-1

చిత్రంలో చూపిన విధంగా చేతి మ‌ణిక‌ట్టుపై ఒకే స‌ర‌ళ రేఖ మాదిరిగా ఉండే నాలుగు గీత‌లు ప‌లువురిలో ఉంటాయి. అలా ఉంటే వారి ఆరోగ్యం బాగున్న‌ట్టు లెక్క‌. పురుషుల్లో చేతి మ‌ణిక‌ట్టుపై ఒకే స‌ర‌ళ రేఖ ఉంటే వారికి ఎలాంటి అనారోగ్యం లేన‌ట్టేన‌ట‌. అదే ఆ రేఖ చిన్న‌దిగా ఉన్నా, మ‌ధ్య‌లో బ్రేక్ వచ్చినా వారు మూత్రాశ‌య సంబంధ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నార‌ని అర్థం. అదే స్త్రీలైతే రుతు సంబంధ స‌మ‌స్య‌లతో బాధ‌ప‌డుతున్న‌ట్టు అర్థం చేసుకోవాలి. ఇక మొద‌టి రేఖ‌కు తోడుగా రెండో రేఖ కూడా బాగా పొడ‌వుగా, స‌మాంతరంగా ఉంటే అది వారి సంప‌ద‌ను, పేరును, ఖ్యాతిని, సంతోషాన్ని సూచిస్తుంది.

wrist-lines-2

చేతి మ‌ణిక‌ట్టుపై ఉండే 2 పొడ‌వైన స‌ర‌ళ రేఖ‌ల కింద 3వ రేఖ కూడా ఉంటే అది ఆ వ్యక్తి యొక్క కెరీర్‌ను, విజ‌యాల‌ను తెలియ‌జేస్తుంది. ఇక నాలుగ‌వ రేఖ కూడా అలాగే పొడ‌వుగా, అన్నింటికీ స‌మాంత‌రంగా ఉంటే ఆ వ్య‌క్తి అన్ని విధాలుగా బాగున్న‌ట్టు లెక్క‌. ఇప్పుడ‌ర్థ‌మైందా, చేతి మ‌ణిక‌ట్టు రేఖ‌ల వెనుక ఉన్న అస‌లు విష‌యం.

  • షరతులు వర్తిస్తాయ్.

Comments

comments

Share this post

scroll to top