ఏ వ‌స్తువులో క‌ల్తీ జ‌రిగిన‌ట్టు అనుమానం వ‌చ్చినా…ఈ నెంబ‌ర్ కు కాల్ చేయండి.!

క‌ల్తీ.. క‌ల్తీ… క‌ల్తీ… నేడు ఎక్క‌డ చూసినా క‌ల్తీ లేని స్వ‌చ్ఛ‌మైన ఆహారం, ప‌దార్థాలు దొర‌క‌డమే గ‌గ‌నంగా మారింది. నిత్యం మ‌న ఉప‌యోగించే పాలు, చ‌క్కెర‌, టీ పొడి, బియ్యం, కారం, ప‌సుపు… ఇలా చెప్పుకుంటూ పోతే క‌ల్తీ జ‌రుగుతున్న వ‌స్తువుల లిస్ట్ చాంతాడంత అవుతుంది. దీంతో ప్ర‌జ‌ల‌కు అస‌లు ఏవి క‌ల్తీవో, ఏవి అస‌లువో క‌ని పెట్ట‌డం క‌ష్టంగా మారింది. ఈ క్ర‌మంలోనే వ్యాపారులు క‌ల్తీ చేసి వ‌స్తువుల‌ను విక్ర‌యిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ మ‌ధ్య కాలంలో ఈ క‌ల్తీల బెడ‌ద ఇంకా పెరిగింద‌నే చెప్ప‌వ‌చ్చు.

అయితే ఇక‌పై ఇలాంటి క‌ల్తీ వ‌స్తువుల‌ను మీరు ఎక్క‌డైనా గ‌మ‌నిస్తే తెలంగాణ రాష్ట్రంలోనైతే సుల‌భంగా ఫిర్యాదు చేయ‌వ‌చ్చు. అందుకు ఎక్క‌డికో వెళ్లాల్సిన ప‌నిలేదు. సింపుల్‌గా ఫోన్ తీసి ఇప్పుడు మేం చెప్ప‌బోయే నంబ‌ర్‌కు కాల్ చేస్తే చాలు. వెంట‌నే టాస్క్‌ఫోర్స్ అధికారులు వ‌స్తారు. క‌ల్తీ వ‌స్తువులు అమ్ముతున్న దుకాణాల‌పై రైడ్ చేస్తారు. ఆ త‌రువాత నిబంధ‌న‌ల మేర‌కు స‌ద‌రు వ్యాపారులపై చ‌ర్య‌లు తీసుకుంటారు. అయితే మ‌రి ఆ నంబ‌ర్ ఏమిటంటే… 9490617111 లేదా 100 నంబ‌ర్‌కు ఫోన్ చేసి కూడా సమాచారం ఇవ్వ‌వ‌చ్చు.

దీంతో అధికారులు వెంట‌నే స్పందిస్తారు. ప్ర‌స్తుతం వ్యాపారులు అనేక వ‌స్తువుల‌ను క‌ల్తీ చేస్తున్న నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఇలా త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకునేలా కంప్లెయింట్ నంబ‌ర్‌ను ఏర్పాటు చేసింది. ప్ర‌జ‌లు తమకు ఏ వ‌స్తువైనా క‌ల్తీ జ‌రిగింద‌ని అనిపిస్తే వెంట‌నే ఆ నంబ‌ర్‌కు కాల్ చేసి చెప్ప‌వ‌చ్చు. అల్లం, పాలు, నూనె, కారం, ప‌సుపు ఇలా ఏ వ‌స్తువు క‌ల్తీ అయినా ప్ర‌జ‌లు నిర‌భ్యంత‌రంగా ఫోన్ చేయ‌వ‌చ్చు..! ఇంకెందుకాల‌స్యం.. ఈ ఫోన్ నంబ‌ర్‌ను మీ సెల్‌ఫోన్‌లో ఫీడ్ చేసుకోండి. అవ‌స‌రం అనుకుంటే కాల్ చేసి కంప్లెయింట్ ఇవ్వండి. ఈ స‌మాచారాన్ని అంద‌రికీ షేర్ చేయండి..!

Comments

comments

Share this post

scroll to top