పాక్ వైమానిక దాడులను తిప్పి కొట్టే క్రమంలో కమాండర్ అభినందన్ విమానం కూలిపోయి కింద పడిపోయాడు. అయితే ఆ విమానం పాక్ లో పడటం అభినందన్ కూడా శతృదేశం భూభాగంలో పాకిస్థానిలకు దొరికిన సంగతి అందరికి తెలుసు.
ఆ తర్వాత పాకిస్థాన్ మన కమాండర్ ని విడిచిపెట్టడం, ఆ తరువాత కొన్ని చెదురు ముదురు సంఘటనలు జరిగాయి. అయితే పాక్ సైన్యానికి చిక్కడానికి ముందు పాక్ ఆక్రమిత కశ్మీర్లో అభినందన్ ఎదుర్కొన్న పరిస్థితుల గురించి ఇండియా టుడే ఎంక్వైరీ చేసింది.
దీని కోసం పాక్ ఆక్రమిత కాశ్మీర్ కి వెళ్ళింది ఇండియా టూ డే టీం. ఈ నేపథ్యంలో అక్కడి స్థానికుల నుంచి వివరాలు సేకరించడానికి ప్రయత్నించింది. అయితే అక్కడి ప్రత్యక్ష సాక్షి మహ్మద్ కమ్రాన్ అనే వ్యక్తి ఎం జరిగిందో వివరించాడు. గాల్లో ఆరు విమానాలు తలపడుతుంటే అతను చుశాడట. అందులో ఒకటి ఇండియా వైపు నుంచి వచ్చింది. ఇంతలో పాకిస్తాన్ వైమానిక దళం ఆ విమానాన్ని వెంబడించింది. అప్పుడే ఆ విమానం కూలిపోయిందని అందులో నుంచి ఓ వ్యక్తి పక్షిలా కిందకు వచ్చాడని మహ్మద్ కమ్రాన్ వివరించాడు. కమాండర్ అభినందన్ పారాచూట్ తెరిచి హోరన్ గ్రామ సమీపంలో ఉన్న కొండ మీద దిగినట్టు అతను వెల్లడించాడు. అయితే కమాండర్ కి అనుమానం వచ్చి తను ఎక్కడ ఉన్నానో అన్న విషయం తెలుసుకునేందుకు ప్రయత్నించడట. మెల్లగా కిందకి దిగి ఇది ఇండియానా .. పాకిస్తానా అని అడిగాడట. ఇండియా అని చెప్పగానే ఆ మాటల్లోనే ఇది భారత్ కాదని గ్రహించి మన ప్రధాని ఎవరు అని మరో ప్రశ్న వేశాడట.
అంతలోనే కమాండర్ అభినందన్ తాను
శత్రు సైన్యానికి చిక్కానని తెలిసి ఎట్టి పరిస్థిత్తుల్లో దేశ రహస్యాలు దాయదులకు తెలియొద్దని తన దగ్గర ఉన్న కొన్ని పత్రాలను మింగేశారు. చేతిలో తుపాకీ పట్టుకొని మరికొన్నింటిని ముక్కలుగా చేసి నీటిలో కలిపేస్తూ భారత్ మాతా కీ జై అని నినదించారు. ఇదంతా అక్కడి స్థానికులు గమనించారు. వెంటనే అభినందన్‌ను రాళ్లతో కొట్టడం మొదలు పెట్టారు. అప్పుడే అక్కడికి పాకిస్తాన్ ఆర్మీ చేరుకొని ఆయనను అదుపులోకి తీసుకుంది. అని తెలియచేశాడు. అభినందన్ ఒక వేళ తుపాకీ పేల్చుంటే అక్కడ ఉన్న వారంతా అభినందన్ ని చంపేసేవారని ఆయన అభిప్రాయపడ్డారు. అభినందన్ తుపాకిని పేల్చకపోవడంతో తన ప్రాణాన్ని రక్షించుకున్నాడని ప్రత్యక్ష సాక్షి మహ్మద్ అన్నాడు.