ప్రతి నెల రీఛార్జ్ చేయించకపోతే మీ నెంబర్ ను కోల్పోవాల్సి ఉంటుంది. 2G వినియోగదారులకు ఇక తిప్పలు తప్పవు.!!

AP2TG Staff

జియో నెట్వర్క్ వచ్చాక, ఫోన్ లను వినియోగించే పద్ధతే మారిపోయింది, ఒకప్పుడు 1GB తో ఒక నెల అంత సావాసం చేసే వాళ్ళం, కానీ జియో రాక తరువాత రోజుకి కనీసం 1GB వాడుతున్నాం, ఒకప్పుడు కాల్స్ చేయాలి అంటే 100 లు 100 లు బ్యాలన్స్ లు వేయించుకొనే వాళ్ళం, కానీ ఇప్పుడు నెలకు RS.100 రీఛార్జ్ చేయిస్తే రోజుకి 1GB, అపరిమిత కాల్స్, రోజుకి 100 మెసేజ్ లు, మొదట్లో ఈ ఆఫర్ కేవలం లవర్స్ కి మాత్రమే ఉపయోగ పడుతుంది అనుకున్నారు. కానీ, దేశం లో సెల్ ఫోన్ ఉండే ప్రతి ఒక్కరికి ఉపయోగ పడుతుంది అని రుజువైంది. ఇంటర్నెట్ వాడకం అనూహ్యంగా పెరిగింది. అలాగే మిగిలిన సెల్ కంపెనీ ల మార్కెట్ దెబ్బ తినింది. 2004లో రూ.999 ప్రీ-పెయిడ్ రీచార్జ్ ప్లాన్‌ను టెలికం సంస్థలు పరిచయం చేశాయి. ఈ ప్లాన్‌ను కొనుగోలు చేసినవారికి జీవితకాలం ఉచిత ఇన్‌కమింగ్ సేవలని హామీనిచ్చాయి. వివిధ రకాల టాప్‌అప్ కార్డులతో ఔట్‌గోయింగ్ కాల్స్, ఎస్‌ఎంఎస్, డేటాను వినియోగించుకునే అవకాశాన్ని కల్పించాయి. ఆరు నెలలకోసారి కనీసం రూ.10 రీచార్జ్ చేస్తేచాలు మొబైల్ నెంబర్ పనిచేస్తూనే ఉంటుంది. 2G వినియోగ దారులు రీఛార్జ్ చేయడం మానేశారు, దింతో ఎయిర్టెల్, ఐడియా, వోడాఫోన్ లకు నష్టాలూ వాటిల్లాయి.

జియో రాకతో ఏర్పడిన పోటీ వాతావరణంలో డేటా ధరలు చౌకవగా, ఔట్‌గోయిల్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లూ పరిమిత కాలవ్యవధిలో ఉచితమైపోయాయి. సంస్థల లాభాలు ఆవిరైపోయి, నెట్‌వర్క్ నిర్వహణ భారంగా మారింది. దీంతోనే లైఫ్‌టైం ఫ్రీ ఇన్‌కమింగ్ సదుపాయానికి స్వస్తి పలుకాలన్న నిర్ణయానికి అటు ఎయిర్‌టెల్, ఇటు వొడాఫోన్ ఐడియా వచ్చేశాయి. కనిష్ఠ రీచార్జ్ ప్లాన్ విలువ రూ.35. ఇందులో రూ.26 టాక్‌టైం వస్తుంది. 100 ఎంబీ 2జీ/3జీ/4జీ డేటా లభిస్తుంది. బేస్ టారీఫ్ ప్రకారం లోకల్, ఎస్‌టీడీ ఔట్‌గోయింగ్ కాల్స్ చార్జీలు వర్తిస్తాయి. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు సెకన్‌కు పైసా  చొప్పున వసూలు చేస్తున్నాయి. టాటా డొకొమో చార్జీ సెకన్‌కు 2.5 పైసలుగా ఉన్నది. 28 రోజుల పాటు ఈ ప్లాన్ వర్తిస్తుంది. ఆ తర్వాత మళ్లీ రూ.35తో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ చేసుకోనిపక్షంలో ఔట్‌గోయింగ్ కాల్స్ నిలిచిపోతాయి. 15 రోజుల తర్వాత ఇన్‌కమింగ్ కాల్స్ కూడా ఆగిపోతాయి. అప్పటి నుంచి 75 రోజులదాకా తదుపరి రీచార్జ్‌కు అవకాశం ఉంటుంది. ఈలోగా మళ్లీ రీచార్జ్ చేసుకోకపోతే మీ మొబైల్ నెంబర్‌ని కోల్పోవాల్సి వస్తుంది. కనుక మీకు మీ నెంబర్ అవసరం అనుకుంటే కచ్చితంగా నెలకు కనీసం RS.35 రీఛార్జ్ చేపియాల్సి ఉంటుంది.

Comments

comments