ఐస్ క్యూబ్స్‌, ఐస్ ఉన్న డ్రింక్స్ తాగుతుంటే వెంట‌నే వాటిని మానేయండి. లేదంటే ప్ర‌మాద‌క‌ర బాక్టీరియా మీ శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తుంది.

ఈ మ‌ధ్య కాలంలో బ‌య‌ట ఏవైనా తిందామంటే చాలు, ఏం అనారోగ్యం వస్తుందోన‌ని ఒక‌టే భ‌యంగా ఉంది. దీనికి తోడు బ‌య‌ట కొనే ఏ ఆహార ప‌దార్థాన్ని తీసుకున్నా దాంట్లో ఏదో ఒక హానిక‌ర ర‌సాయ‌నం ఉందని, వాటిని తింటే ఆరోగ్యానికి హాని క‌లుగుతుంద‌ని ప‌లు రీసెర్చి ల్యాబ్‌లు హెచ్చ‌రిస్తున్నాయి. ఈ క్ర‌మంలో దేన్ని తినాలో, దేన్ని తిన‌కూడ‌దో తెలియ‌ని అయోమ‌య స్థితి నెల‌కొంది. మొన్నా నడుమ మ్యాగీ నూడుల్స్‌, త‌రువాత బ్రెడ్ ఉత్ప‌త్తులు, అనంత‌రం అల్యూమినియం ఫాయిల్స్‌… ఇప్పుడు తాజాగా ఐస్ క్యూబ్స్‌. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఐస్ క్యూబ్స్‌లో ఓ ర‌క‌మైన హానిక‌ర‌మైన బాక్టీరియా ఉంటోంద‌ట‌. దీని వ‌ల్ల మ‌న ప్రాణాల‌కు ముప్పు పొంచి ఉంద‌ని ఇప్పుడు తాజాగా మ‌రో పరిశోధ‌న వెలుగులోకి వ‌చ్చింది.

ice-cubes

ముంబైలోని బ్రిహాన్ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (బీఎంసీ) వారు స్థానికంగా ఉన్న ప‌లు ప్రాంతాల్లోని ఐస్ వ‌ర్త‌కులు, శీత‌ల పానీయాల విక్రయ‌దారులు, హోట‌ల్స్, బార్స్ వంటి వాటి నుంచి దాదాపు 948 ఐస్ క్యూబ్ శాంపిల్స్‌ను ఇటీవ‌ల సేక‌రించారు. వాట‌న్నింటినీ టెస్ట్ చేయ‌గా వాటిలో 870 శాంపిల్స్‌లో అంటే 92 శాతం ఐస్ క్యూబ్స్‌లో ప్ర‌మాద‌క‌ర ‘ఇ.కోలి’ బాక్టీరియా ఉన్న‌ట్టు నిర్దార‌ణ అయింది.

ఐస్ క్యూబ్స్ త‌యారీదారులు నాణ్య‌త లేని నీటిని ఉప‌యోగించ‌డం, స‌రైన ప‌రిశుభ్ర‌త పాటించ‌క‌పోవ‌డం వ‌ల్ల మ‌లంలో ఉండే ఇ.కోలి బాక్టీరియా ఐస్ క్యూబ్స్‌లోకి చేరుతుంద‌ని బీఎంసీ వారు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో ఆ ఐస్‌క్యూబ్స్‌ను తీసుకున్న వారి శ‌రీరం లోప‌లికి ఆ బాక్టీరియా ప్ర‌వేశిస్తుంద‌ని దీంతో గ్యాస్‌, డ‌యేరియా, వాంతులు, విరేచ‌నాలు, ఫుడ్ పాయిజ‌నింగ్ త‌దిత‌ర అనారోగ్య స‌మస్య‌లు తలెత్తేందుకు అవ‌కాశం ఉంద‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు. అస‌లే రానున్న‌ది వ‌ర్షాకాలం కావ‌డంతో ఈ స‌మ‌స్య‌లు మ‌రింత ఎక్కువ‌య్యేందుకు అవ‌కాశం ఉంద‌ని వారు చెబుతున్నారు. సో, ఇక నుంచి మీరు కూడా ఐస్ క్యూబ్స్‌, ఐస్‌ను బ‌య‌ట తిన‌డం మానేయండి. వీలైనంత వ‌ర‌కు వాటిని ఇంట్లోనే సొంతంగా త‌యారుచేసుకుని ఉపయోగించండి. ఎందుకంటే ఆరోగ్యం మ‌న‌కు ముఖ్యం క‌దా!

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top