మమ్మల్ని గెలిపిస్తే అద్భుతాలు చేస్తాం : జీవిత రాజశేఖర్.

మా అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. ఆల్రెడి అధికారంలో ఉన్న శివాజీరాజా ప్యానెల్ మరోసారి అధికారం చేజిక్కించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభం చేసారు. అయితే ఈ సారి తమకు ఛాన్స్ ఇవ్వవల్సిందింగా నరేష్ ప్యానెల్ ప్రచారం ప్రారంభించారు. ఈ నెల 10న జరగనున్న ఎన్నికల కోసం పోరు మొదలైంది.


నరేష్ ప్యానెల్ తరపున ప్రధాన కార్యదర్శిగా జీవిత బరిలోకి దిగారు. గతంలో మా అసోసియేషన్ లో ఉన్న వారిపై ఆమె విమర్శనాస్త్రాలు సంధించారు. సినిమా వాళ్లంటే నీచంగా చూసే స్థాయికి తీసుకొచ్చారని విమర్శించారు జీవిత. మా అసోసియేషన్ కు ఉనికి లేకుండా చేసారన్నారు. డ్రగ్స్ కేసు, ఓ లేడి ఆర్టిస్ట్ చేసిన ఆరోపణల్లోనూ సంబంధం లేనివారందని లాగారని జీవిత మండిపడ్డారు.
‘మా’ లో ఎలాంటి వివాదాలు రేగినా తమకు తాము పరిష్కరించుకోగలుగుతామన్నారు. అనవసర విషయాల్లో ఇతరుల జోక్యం ఎక్కువైందన్నారు. మూవీ ఆర్టిస్టులంటే చిన్న చూపు చూస్తున్నారని… ఆ భావన ప్రజల్లోంచి పోయేలా చర్యలు చేపడతామన్నారు. ఇండస్ట్రీకి కొత్త తరం వాళ్లు వస్తున్న సమయంలో ఇలాంటి ఆరోపణలు రాకుండా చూస్తామని జీవిత అన్నారు.
ఏ విధంగా ఈ ప్రొపెషన్ తక్కువైంది. ఇతర ప్రొఫెషన్ల మాదిరిగానే ఈ ప్రొఫెషన్ కూడా చాలా గౌరవప్రదంగా ఉండాలి. సినిమా వాళ్లు అని చీప్ గా చూసే రోజు రాకూడదు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్ అని గర్వంగా చెప్పుకునే రోజులు త్వరలో వస్తాయి. సినిమా ఇండస్ట్రీ వారిని ఎవరైన తక్కువ చేసి మాట్లాడితే సహించేది లేదని మండిపడ్డారు జీవిత.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు వాయిస్ లేకుండా పోయింది. ఆర్టిస్ట్ గా పుట్టడమనేది ఒక వరం. మనం స్ట్రాంగ్ గా ఉంటే మనల్ని ఎవరు ఏమి అనలేరు. ఒకరు మనల్ని వేలు ఎత్తి చూపే పరిస్ధితి ఎందుకు తీసుకురావాలి అని జీవిత ప్రశ్నించారు.
మా ఎన్నికలపై ఇప్పటికే నరేష్ వర్గం మెగాస్టార్ చిరంజీవిని కలిసారు. ‘మా’ లో ఎలాంటి వివాదాలు వచ్చాయో చిరంజీవికి వివరించారు. అదే విధంగా ఒక టర్మ్ చేసిన ప్యానెల్ ఎలాంటి వివాదాలకు కారణమైంది, అదే విధంగా ఏకగ్రీవం కావాల్సిన చోట మళ్లీ ఎందుకు ఎన్నికలకు వెళ్తున్నారు లాంటి విషయాలు చిరంజీవికి వివరించారు. ఈ సారి మమ్మల్ని గెలిపిస్తే అసోసియేషన్ లో అద్భుతాలు చేసి చూపెడతామన్నారు జీవిత.

 

Comments

comments

Share this post

scroll to top