సెన్సార్ బోర్డ్ అన్నింట్లోనూ క‌ల‌గ‌జేసుకుంటే ఎలా ఉంటుందో తెలుసా..?

‘ఉడ్తా పంజాబ్’ సినిమా గురించి తెలుసుగా. డ్ర‌గ్స్ వ‌ల్ల పంజాబ్ యువ‌త ఎలా నిర్వీర్య‌మైపోతుందోన‌న్న క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ చిత్రం ఈ నెల 17వ తేదీన విడుద‌ల కావ‌ల్సి ఉంది. కాగా సెన్సార్ బోర్డు ఇటీవ‌లే ఈ చిత్రాన్ని సెన్సార్ చేయ‌గా సినిమాకు 89 క‌త్తెర‌లు ప‌డ్డాయి. చిత్రంలోని కొన్ని స‌న్నివేశాలు అభ్యంత‌ర‌క‌రంగా ఉన్నాయంటూ సెన్సార్ బోర్డు స‌భ్యులు సినిమాలో 89 సీన్ల‌ను క‌ట్ చేశారు. దీనిపై ఆ సినిమా యూనిటే కాదు, యావత్ బాలీవుడ్ ప్ర‌పంచ‌మంతా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఉడ్తా పంజాబ్ యూనిట్‌కు బాలీవుడ్ న‌టీన‌టులంద‌రూ త‌మ మ‌ద్ద‌తు ప‌లికారు. సెన్సార్‌బోర్డ్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు స‌రిగ్గా లేదంటూ వారి విమ‌ర్శ‌లు చేశారు. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన వ్యవ‌హారం కోర్టులో ఉంది. అటు సెన్సార్‌బోర్డ్‌కు, ఇటు సినిమా యూనిట్ స‌భ్యులు, బాలీవుడ్ వ‌ర్గాల‌కు మ‌ధ్య ప‌చ్చ‌గడ్డి వేస్తే భ‌గ్గుమ‌నే కోల్డ్‌వార్ న‌డుస్తోంది. అయితే అధిక శాతం మంది మాత్రం సెన్సార్ బోర్డ్ మ‌రీ వితండ వాదం చేస్తోంద‌ని, సినిమా విష‌యంలో అన‌వ‌సరంగా రాద్ధాంతం చేస్తోంద‌ని ఆరోపిస్తున్నారు. ఈ క్ర‌మంలో కొంద‌రైతే ఇంకా ముందుకు వెళ్లి సోష‌ల్ మీడియాలో సెన్సార్ బోర్డ్‌కు వ్య‌తిరేకంగా పోస్ట్‌లు పెడుతున్నారు. అలా కొంద‌రు చేసిన ప్ర‌య‌త్నంలో భాగంగా ప‌లు ఫొటోలు ఇప్పుడు సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సైట్ల‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

‘దేశంలోని ప్ర‌తి అంశాన్ని నియంత్రించే ప‌వ‌ర్ సెన్సార్ బోర్డుకు ఉంటే అప్పుడు వారు ఏం చేస్తారో చూడండి’ అంటూ కొన్ని ఫొటోల‌ను కొంత మంది వ్యంగ్యంగా, హాస్యం స్ఫురించేలా మార్చి మ‌రీ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వీటిపై సామాజిక మాధ్య‌మాల్లో హాట్ టాపిక్‌లే న‌డుస్తున్నాయి. ఆ ఫొటోల‌ను ఒక‌సారి మీరూ చూడండి…

censor

censor

censor

censor

censor

censor

చూశారుగా..! ప్ర‌తి అంశంలోనూ సెన్సార్ బోర్డ్ క‌ల‌గ‌జేసుకుంటే అప్పుడు దేశంలో ప‌రిస్థితి అలా ఉంటుంద‌ని ఆ ఫొటోలు చూపుతున్నాయి. అది నిజ‌మే కానీ, ప్ర‌తి అంశంలోనూ సెన్సార్ వారు క‌ల‌గ‌జేసుకోలేరు క‌దా! కాక‌పోతే సినిమాల‌కైతే ఎడా పెడా క‌త్తెర‌లు పెడ‌తారు. దీంతో అస‌లు వీక్ష‌కులకు ద‌ర్శ‌కుడి పాయింట్ అర్థం కాదు. ఈ క్ర‌మంలో వారికి మ‌రోలా మెసేజ్ వెళ్తుంది. స‌రే! ఏది ఏమైనా ఉడ్తా పంజాబ్ వివాదం ఇప్ప‌ట్లో స‌ద్దుమ‌ణిగేలా క‌నిపించ‌డం లేదు. చివ‌రికి ఏం జ‌రుగుతుందో చూడాలి మ‌రి!

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top