గూగుల్ ఇమేజ్ సెర్చ్‌లో 241543903 నంబ‌ర్‌ను సెర్చ్ చేస్తే వ‌చ్చే ఈ విచిత్రం చూడండి..! ఆశ్చ‌ర్యపోతారు.

నేడు న‌డుస్తున్న‌దంతా సోష‌ల్ మీడియా యుగం. అందులో ఎవ‌రైనా తాము చేసిన‌ ఏదైనా ఒక విచిత్ర‌మైన ప‌నికి చెందిన పోస్టును పెడితే ఇక అది వైర‌ల్ అవుతుంది. ఇలాంటి సంద‌ర్భాల్లో కొన్ని సార్లు స‌ద‌రు పోస్టుల్లో ఉన్న‌ట్టుగానే ఆ ప‌నులను చేయాల‌ని చూస్తారు. వాటిని అనుక‌రిస్తారు. దీంతో అవి కూడా వైర‌ల్ అవుతుంటాయి. ఇప్పుడు మేం చెప్ప‌బోతున్న‌ది కూడా స‌రిగ్గా ఇలాంటి ఓ పోస్టు గురించే. నిజానికి అది ఇప్ప‌టిది కాదు. ఎప్పుడో వైర‌ల్ అయింది. కానీ దాని పేరిట ఇప్ప‌టికీ కొంద‌రు ఫొటోల‌ను అప్‌లోడ్ చేసి సోష‌ల్ మీడియాలో, ఇంట‌ర్నెట్‌లో పెడుతూనే ఉన్నారు. అయితే ఇంత‌కీ ఆ పోస్టు ఏమిటో, దానికి సంబంధించిన ఫొటో ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

ఇంట‌ర్నెట్‌లో గూగుల్ సెర్చ్‌లో ఇమేజ్ సెర్చ్‌లోకి వెళ్లి 241543903 అనే నంబ‌ర్‌ను అందులో సెర్చ్ చేయండి. అప్పుడు కింద వ‌చ్చే సెర్చ్ రిజ‌ల్ట్స్‌లో మీకు అన్నీ దాదాపుగా ఒకేలాంటి ఇమేజ్‌లు క‌నిపిస్తాయి. అవేమిటంటే.. త‌ల‌ను ఫ్రిజ్‌లో పెట్టి ఉన్న‌ప్పుడు తీసిన ఫొటోలు సెర్చ్ రిజల్ట్స్‌లో వ‌స్తాయి. అయితే పైన చెప్పిన ఆ నంబ‌ర్‌కు, ఈ త‌ర‌హా ఫొటోల‌కు సంబంధం ఏముందో తెలుసా..?

జే హాత్‌వే అనే ఓ వ్య‌క్తి 2009లో తాను కొన్న ఫ్రిజ్ డోర్ తీసి అందులో త‌ల‌పెట్టి ఫొటో తీసుకున్నాడు. అనంత‌రం ఆ ఫొటోకు ఆ ఫ్రిజ్ సీరియ‌ల్ నంబ‌ర్ 241543903 ను రీనేమ్ చేశాడు. త‌రువాత ఆ ఫొటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో అత‌ను చేసిన ప‌నిని అంద‌రూ ఫాలో అయ్యారు. వారు కూడా త‌మ త‌మ ఇండ్ల‌లో ఉండే ఫ్రిజ్‌ల‌లో త‌ల‌లు పెట్టి ఫొటోలు తీసి వాటికి సేమ్ అదే నంబ‌ర్‌ను రీనేమ్ చేసి వాటిని నెట్‌లోకి అప్‌లోడ్ చేశారు. దీంతో అప్ప‌ట్లో ఈ ఫొటో ట్రెండ్ వైర‌ల్ అయింది. అయితే ఇప్ప‌టికీ చాలా మంది అలా ఫ్రిజ్‌లో త‌ల‌పెట్టి ఫొటో తీసుకుని దానికి ముందు చెప్పిన ఆ నంబ‌ర్‌తో రీనేమ్ చేసి ఆ ఫోటోను సోష‌ల్ మీడియాలో పెడుతున్నారు. ఇక 241543903 అనే ఈ నంబ‌ర్‌ను కొడితే అన్నీ ఫ్రిజ్‌లో త‌ల‌లు పెట్టిన వారి ఫొటోలు రావ‌డం వెనుక ఉన్న కార‌ణం కూడా ఇదే. అయితే జే హాత్ వే నిజానికి ఇదే కాదు, చాలా చిత్ర‌మైన ప‌నులు చేసి వాటిని సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా అవి కూడా బాగా వైర‌ల్ అయ్యాయి. అవును, ఏ ప‌ని లేని వారికి ఇలాంటి చిత్ర‌మైన ఐడియాలు వ‌స్తాయి. అంతే క‌దా..!

Comments

comments

Share this post

scroll to top