ఇద్దరు యువకులు ఆమె మెడలో చైన్ లాక్కొని పోయారు..! తర్వాత ఆమె చేసిన పని తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు.!

యముడితో కొట్లాడి మరీ తన భర్త ప్రాణాలను రక్షించుకున్న  సతీసావిత్రి గుర్తుందా..హిందూ పురాణాలలో మహా పతివ్రత..ఇప్పటికి ఎందరో ఆడవారికి స్పూర్తి . సావిత్రిలానే తమ మాంగళ్య బంధానికి గుర్తు అయిన మంగళసూత్రాన్ని కొట్టేసిన దొంగలను వెంబడించి,వారితో  పోరాడి చివరికి తన తాళిబొట్టుని దక్కించుకుంది నేటి సావిత్రి..సౌమ్య.. సోషల్ మీడియలో వైరలైన ఈ న్యూస్ తో ఓవర్ నైట్ స్టార్ అయింది..ఇంతకీ ఎవరీ సౌమ్య..ఈ ఘటన వివరాలు..

కేరళలోని కొల్లం జిల్లా, తెవలక్కార పట్టణానికి చెందిన  సౌమ్య వయసు 28 ఏళ్లు. భర్త టైలర్‌. ఇద్దరు పిల్లలు శోభన,సోనా… సేల్స్ గాళ్ గా ఉద్యోగం.ఇల్లు,కుటుంబం ,ఉద్యోగం ఇవి మూడే తన లోకం.వారం వరకు తానోక సాధారణ మధ్య తరగతి మహిళ .కానీ  ఇప్పుడు కొల్లం జిల్లాలో తానొక సెలబ్రిటీ. సినిమా తారల కంటే ఎక్కువ క్రేజ్‌ ఆమె సొంతం అయింది.. కన్నుకొట్టి  ఓవర్‌నైట్‌ స్టార్ అ అయిన ప్రియాప్రకాశ్‌ వారియర్‌ కంటే ఈ వారియరే ఇప్పుడు బాగా ఫేమస్‌ అయింది.ఇంతకీ ఆమె ఏం చేసింది? సినిమా షూటింగ్‌ను తలపిస్తూ చేజ్‌ చేసింది. చైన్‌ స్నాచర్స్‌ను ఒడిసి పట్టుకుని చాచి కొట్టి  తన మంగళసూత్రాన్ని తెచ్చుకుంది.

ఉద్యోగం నుంచి సాయంత్రం తన స్కూటీ మీద ఇంటికి వస్తున్న సౌమ్యను ఒక బైక్‌ వెంబడించింది. బైక్‌ మీద ఇద్దరు యువకులు ఆమె పక్కగా బండిని పోనిస్తూ ఆమె మెడలోని తాళిబొట్టును లాక్కున్నారు. క్షణకాలం పాటు ఏం జరిగిందో తెలియక ఆగిపోయిన సౌమ్య వెంటనే పరిస్థితిని అర్దం చేసుకుని తేరుకుంది. దారిన పోయే వారికి ఏం జరిగిందో తెలిసేలా ‘దొంగ… దొంగ… పట్టుకోండి’ అని అరుస్తూ స్కూటీ మీద గొలుసు దొంగలను వెంబడించింది. ‘దాదాపుగా మూడున్నర కిలోమీటర్ల దూరం వెంబడించి వారి బైక్‌ ను ఓవర్‌టేక్‌ చేసి వారి ఎదురుగా వచ్చింది. ఆ వేగంలో ఆమె స్కూటీ బైక్‌ను ఢీకొడుతూ ఆగింది. పరుగున వచ్చిన వారు, ఏం జరుగుతుందో తెలియకపోయినా సరే అరుపులతో గుమిగూడిన వారు బైక్‌ నడుపుతున్న యువకుడిని ఒడిసి పట్టుకున్నారు. సౌమ్య అతడి ముఖం మీద పిడిగుద్దులు గుద్దింది. చైన్‌ ఉన్న వాడు మాత్రం తప్పించుకుని పారిపోయాడు. ఈ లోపు కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాళ్లు కూడా రంగంలో దిగారు. పారిపోతున్న దొంగను నిమిషాల్లోనే పట్టుకున్నారు.

భారతీయ స్త్రీలకు తాళిబొట్టు ఎంతవిలువైందో మనందరికి తెలిసిందే..‘‘నాకు తాళిబొట్టు చాలా విలువైంది. దానిని లాక్కుపోతే చూస్తూ ఎలా ఉండను? దండ లేకుండా ఇంటికి వెళ్లేది లేదు’’ అనుకున్నాను. అందుకే ఎలాగైనా వాళ్లను పట్టుకుని దండతోనే ఇంటికి వెళ్లాలనే కసితో వెంబడించాను. అందుకే భయపడకుండా వారిని వెంబడించి నా తాళిని దక్కించుకున్నానని సమాధానం ఇస్తుంది సౌమ్య.చైన్ స్నాచర్ల గురించి ఇప్పటివరకు ఎన్నో కథనాలు విన్నాం కానీ… చైన్ స్నాచర్ల భరతం పట్టిన సౌమ్య కథనం ఇప్పుడు అందరికి స్పూర్తి..

Comments

comments

Share this post

scroll to top