మన దేశంలో ఉన్న అత్యంత ధనవంతుల్లో ముఖేష్ అంబానీ ఒకరని అందరికీ తెలుసు. ఆయనకు రోజూ అందే లగ్జరీ సదుపాయాల గురించి మనం నిజంగా మాటల్లో వర్ణించలేం. అంత ఖరీదైన లైఫ్‌ని ఆయన అనుభవిస్తున్నారు. అయితే ఆయన మాత్రమే కాదు, ఆయన కుమారులు ఆకాష్, అనంత్ అంబానీలకు రోజూ లభించే విలాసవంతమైన సౌకర్యాలు కూడా అదే రేంజ్లో ఉంటాయి. ఇంట్లో లేదా బయట ఎక్కడికెళ్లినా వారికి రాచమర్యాదలు జరుగుతాయి. ఈ క్రమంలోనే వారిద్దరూ నిత్యం తిరిగే ఖరీదైన కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖేష్ అంబానీకి కార్లంటే ఎంత ఇష్టమో అదే అలవాటు ఆయన ఇద్దరు కొడుకులకు కూడా వచ్చింది. దీంతో వారిద్దరూ ఖరీదైన బెంట్లీ మోటార్స్‌కు చెందిన కార్లను వాడుతున్నారు. ముఖేష్ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ ఇండియాలోనే అత్యంత ఖరీదైన ఎస్యూవీ బెంట్లీ బెంట్యాగా ను కొనుగోలు చేశాడు. దీని ధర సుమారుగా రూ.3.85 కోట్లుగా ఉంది. ఇందులో పలు లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి. బెంట్లీ బెంట్యాగా ఎస్‌యూవీలో 6.0-లీటర్ సామర్థ్యం ఉన్న డబ్ల్యూ12 ఇంజన్ ఉంది. ఇది గరిష్టంగా 600బీహెచ్పీ పవర్, 900ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎస్యూవీ కేవలం 4.1 సెకండ్ల కాలవ్యవధిలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇక ఈ కార్లో ఉన్న గడియారం ఖరీదే సుమారుగా రూ.1.95 కోట్లు ఉంటుందని అంచనా.
ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ కూడా కార్ల విషయంలో తక్కువ ఏమీ తినలేదు. తండ్రి, అన్న లాగే ఇతను కూడా ఖరీదైన కార్లో తిరుగుతాడు. అనంత్ అంబానీకి అత్యంత అరుదైన రోల్స్ రాయిస్ డ్రాప్ హెడ్ కూపే కారు ఉంది. దీని ధర సుమారుగా రూ. 8.84 కోట్లుగా ఉంది. ఈ డ్రాప్ హెడ్ కూపే కారు రోల్స్ రాయిస్ లైనప్‌లోనే అత్యంత ఖరీదైంది కావడం విశేషం. ఇది లుక్ పరంగా కూడా బాగుంటుంది. తెలుపు రంగు బాడీ పెయింట్, ఎరుపు రంగు రూఫ్ టాప్, బ్లాక్ అల్లాయ్ వీల్స్‌ను ఈ కారు కలిగి ఉంది. సాంకేతికంగా రోల్స్ రాయిస్ డ్రాప్ హెడ్ కూపే కారులో 6.75 లీటర్ల సామర్థ్యం ఉన్న వి12 ఇంజన్ ను ఏర్పాటు చేశారు. ఇది గరిష్టంగా 454 బీహెచ్పీ పవర్, 720ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. వేగం విషయానికి వస్తే ఇది కేవలం 5.8 సెకండ్ల కాలంలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ప్రస్తుతం ఉన్న రోల్స్ రాయిల్స్ లైనప్‌లో అత్యంత వేగవంతమైన కారు కూడా ఇదే అని చెప్పవచ్చు. ఇక అనంత్ అంబానీ రోల్స్ రాయిస్ డ్రాప్ హెడ్ కూపేతో పాటు మరో రెండు ఫార్చ్యూనర్ ఎస్యూవీ కార్లు ఎప్పుడూ వెంటే ఉంటాయి. అనంత్ ఎక్కడికెళ్లినా మహారాష్ట్ర పోలీసులు ఈ ఆర్మ్డ్ వెహికల్స్‌లో గస్తీకి వెళతారు. తెలుసుకున్నారు కదా.. ముఖేష్ అంబానీ కుమారుల లగ్జరీ కార్ల గురించి. మరి వీటిపై మీరేమంటారు..!
Watch video: