SHOCKING NEWS: ఇద్దరు విద్యార్ధినీలు ఆత్మహత్య…సూసైడ్ కి ముందు ఓ అమ్మాయి సోషల్ మీడియాలో స్టేటస్..!

Sainath Gopi

నేటి బాలికలే రేపటి మహిళలు అంటారు. జగతిని తల ఎత్తుకునేలా చేయాల్సిన ఇద్దరు విద్యార్థినులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఒకరు బిటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. మరొకరు ఇంటర్. ఈ విషాదం హైదరాబాద్ లో జరిగింది. ఎంతో విద్యావంతులు అయిన వీరు ఇలా ఆత్మహత్య చేసుకోవటం కలకలం రేపుతోంది. వివరాలలోకి వెళ్తే..

హైదరాబాద్ సిటీ కూకట్ పల్లి పరిధిలోని సూరారం కాలనీ కి చెందిన మౌనిక “నర్సింహారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో” బీటెక్ ఫోర్త్ ఇయర్ చదువుతుంది. బుధవారం (అక్టోబర్-11) అర్థరాత్రి ఇంట్లో ఉరి వేసుకుంది. అంతకుముందే.. తన జీవితం బాధాకరంగా మారిందంటూ… ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో మౌనిక స్టేటస్ పెట్టింది. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. తల్లిదండ్రు స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు.

హైదరాబాద్ లోని మాదాపూర్ శ్రీచైతన్య కాలేజీలో ఓ విద్యార్థిని ఉరేసుకుని చనిపోయింది. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం రానంపల్లి గ్రామానికి చెందిన సంయుక్త ఎంసెట్ లాంగ్‌టర్మ్ కోచింగ్‌ తీసుకుంటోంది. గురువారం (అక్టోబర్-12) ఉదయం కాలేజీలోని సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకున్నది. చదువు ఒత్తిడి కారణంగానే సంయుక్త ఆత్మహత్యకు పాల్పడిందని భావిస్తున్నారు. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సూసైడ్ నోట్ కూడా రాసినట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు.

Comments

comments