ఏఎస్పీ సునీత – సీఐ మల్లికార్జున్‌రెడ్డి “వాట్సాప్ మెసేజీలు” ఇదేనంట.? చూస్తే తప్పక తిట్టుకుంటారు.!

అవినీతి నిరోధక శాఖలో అదనపు ఎస్పీ సునీతారెడ్డికి కల్వకుర్తి ఇన్‌స్పెక్టర్‌ మల్లికార్జున్‌రెడ్డికి ఐదేళ్లుగా పరిచయం ఉంది. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఏఎస్పీ సునీతారెడ్డి భర్త సురేందర్‌రెడ్డి అమెరికాలో ఉద్యోగం చేస్తుండగా.. ఆమె ఇందూ ఫార్చ్యూన్‌ ఫీల్డ్స్‌ అపార్ట్‌మెంట్‌ 13వ ఫ్లోర్‌ నివసిస్తున్నారు. వివాహేతర సంబంధం గురించి రెండేళ్ల క్రితం సురేందర్‌రెడ్డికి తెలిసింది. కుటుంబ పెద్దల సమక్షంలో భార్యను నిలదీశారు. మల్లికార్జున్‌రెడ్డిని కూడా తీవ్రంగా మందలించారు. దీంతో వారిద్దరూ ఇకమీదట అలా చేయబోమని చెప్పారు. రెండు నెలల నుంచి వీరిద్దరు మళ్లీ సఖ్యతగా ఉంటున్నట్లు సురేందర్‌రెడ్డికి అనుమానం వచ్చింది.


ఇదిలా ఉంటే.. ఈ వివాదంపై కల్వకుర్తి సీఐ మల్లికార్జున్‌రెడ్డి వివరణ పేరుతో ఒక వాట్సప్‌ సందేశం చక్కర్లు కొడుతోంది. అందులో… తమకు వివాహేతర సంబంధం లేదని, అధికారికంగానే పెళ్లి చేసుకుందామని అనుకున్నామని మల్లికార్జునరెడ్డి అన్నట్లు ఉంది. ఆదివారం రాత్రి సునీతరెడ్డిని ఇంటి వద్ద డ్రాప్‌ చేయడానికి వెళ్లానని అందులో పేర్కొన్నారు. ‘‘సునీతతో నాకు ఐదేళ్లుగా పరిచయం ఉంది. ఆమె విడాకులకు కూడా దరఖాస్తు చేసుకున్నారు. విడాకులు మంజూరయిన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నాం.


సునీతారెడ్డి భర్తకు ఈ విషయాలన్ని చెప్పాను’’ అని మల్లికార్జున్‌ రెడ్డి అన్నట్లు వాట్సప్‌ సందేశంలో ఉంది. తన భార్యతో సఖ్యంగా లేనని, త్వరలోనే మీడియా ముందుకు ఇద్దరం వచ్చి పూర్తి వివరాలు వెల్లడిస్తామని మల్లికార్జున్‌ అన్నట్లు అందులో పేర్కొన్నారు. సీఐ మల్లికార్జున్‌రెడ్డి తన భార్య సునీతా రెడ్డిని ట్రాప్‌ చేశాడని సురేందర్‌రెడ్డి అన్నారు. గతంలో వివాహేతర సంబంధం గురించి ఇద్దరినీ ప్రశ్నించానని, ఇక మీదట అలా చేయమని హామీ ఇచ్చారని చెప్పారు.


మళ్లీ మూడు నెలల నుంచి వాళ్లిద్దరూ దగ్గరయ్యారని సురేందర్‌రెడ్డి అన్నారు. సీఐ చేతిలో మరో యువతి మోస పోకుండా ఉండడం కోసమే ఇద్దరిపై నిఘా పెట్టి రెడ్‌ హ్యాండెడ్‌గా సునీతారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పట్టుకోవడం జరిగిందని అన్నారు. సీఐ మల్లికార్జున్‌రెడ్డిని సస్పెండ్‌ చేయాలని సునీతారెడ్డి అమ్మ, అత్త డిమాండ్‌ చేశారు. మల్లికార్జున్‌రెడ్డిని సస్పెండ్‌ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఏఎస్పీతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకోవడాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.

watch video here:

https://www.youtube.com/watch?v=QoSbAOZrJwQ

source: abn

Comments

comments

Share this post

scroll to top