ఫైన్ ప‌డినా మ‌ళ్లీ అలాగే.! అవుట్ అయిన తర్వాత ఆడియన్స్ గోల చేస్తుంటే ఎలా తంతున్నాడో చూడండి! [VIDEO]

ఏ ఆట అయినా ఆడేట‌ప్పుడు అందులో ఆడే జ‌ట్ల‌కు దూకుడు కొంత‌ ఉండాల్సిందే. ఆ దూకుడుతో ఆట బాగా ఆడి విజ‌యం సాధించేందుకు వీలుంటుంది. కానీ అదే దూకుడు ప్ర‌త్య‌ర్థి జ‌ట్టును కించ ప‌రిచే విధంగా ఉండ‌కూడ‌దు. వారికి ఇబ్బంది క‌లిగించ‌కూడ‌దు. ఇది క్రీడాస్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం. ఇప్ప‌టికే మీకు ఓ ఐడియా వ‌చ్చి ఉంటుంది, మేం దేని గురించి చెబుతున్నామో. అవును, బంగ్లాదేశ్ క్రికెట్ టీం గురించే. ఇటీవ‌ల ఈ జ‌ట్టు వార్త‌ల్లో బాగా నిలిచింది. అయితే అది వారి అద్భుత‌మైన ఆట తీరుతో కాదు, వారి ప్ర‌వ‌ర్త‌న‌తో. దాని వ‌ల్లే ఆ జ‌ట్టు ఇప్పుడు అంద‌రిచే తీవ్ర విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటోంది. ఇంత‌కీ అస‌లు జ‌రిగిన విష‌యం ఏమిటంటే…

మొన్నీ మ‌ధ్యే బంగ్లాదేశ్ జ‌ట్టు శ్రీ‌లంక‌పై ఆడి గెలిచి ఫైన‌ల్‌లో భార‌త్‌తో పోరుకు అర్హ‌త సాధించింది క‌దా. అయితే ఆ మ్యాచ్‌లో చివ‌రి ఓవ‌ర్ లో బంగ్లాదేశ్ ఆట‌గాళ్లు రచ్చ రచ్చ చేశారు. శ్రీ‌లంక బౌల‌ర్ లాస్ట్ ఓవ‌ర్‌లో మొద‌ట‌గా రెండు వ‌రుస షార్ట్ పిచ్ బంతుల‌ను వేశాడు. దీంతో రెండో బంతికి బంగ్లాదేశ్ ప్లేయ‌ర్ ర‌నౌట్ అయ్యాడు. అయితే రెండు వ‌రుస షార్ట్ పిచ్ బంతుల‌ను వేసినా రెండో బంతిని నో బాల్‌గా ఎందుకు ప్ర‌క‌టించ‌లేద‌ని గ్రౌండ్‌లో ఉన్న బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ అంపైర్ల‌పై ఫైర్ అయ్యారు. దీంతో ఆ జ‌ట్టు కెప్టెన్ ష‌కిబ్ అల్ హ‌సన్ మ్యాచ్ ఆడ‌కుండా బ‌య‌ట‌కు వ‌చ్చేయాల‌ని ఆ జ‌ట్టు ప్లేయ‌ర్స్‌కు సూచించాడు. కానీ చివ‌ర‌కు ఎలాగో వివాదం స‌ద్దుమ‌ణిగింది. అదే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలిచి ఫైనల్ పోరుకు వెళ్లింది కూడా. కానీ మ్యాచ్ అయ్యాక బంగ్లా ఆట‌గాళ్లు మ‌రింత రెచ్చిపోయారు. కోబ్రా డ్యాన్స్ అని చెప్పి మైదానంలో మ్యాచ్ గెలిచాక కొంచెం అతి చేశారు. ఇది శ్రీ‌లంక ఆట‌గాళ్ల‌కు న‌చ్చ‌లేదు. దీంతో మ‌ళ్లీ ఇరు జ‌ట్ల మ‌ధ్యా గొడ‌వ అయింది.

అయితే శ్రీ‌లంక జ‌ట్టుపై మ్యాచ్ గెలిచినా కూడా బంగ్లాదేశ్ ఆట‌గాళ్లు డ్రెస్సింగ్ రూమ్ అద్దాల‌ను ప‌గ‌ల‌గొట్టారు. కాగా ఈ మ్యాచ్ త‌రువాత బంగ్లా కెప్టెన్ ష‌కిబ్‌కు ఐసీసీ ఫైన్ వేసింది. అయిన‌ప్ప‌టికీ ఫైన‌ల్ మ్యాచ్‌లోనూ ఆ జ‌ట్టు ఆట‌గాళ్ల తీరుమార‌లేదు. ఆ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జ‌ట్టుకు చెందిన మ‌హమ్మ‌దుల్లా ర‌న్ అవుట్ అయ్యాడు. అయితే అత‌ను డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తున్న సంద‌ర్భంలో అక్క‌డే ఉన్న ఫ్యాన్స్ సంబ‌రాల‌ను చూసి అత‌ను తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ కాలితో మెట్ల తోవ పక్క‌నే ఉన్న ఐర‌న్ రాడ్స్‌ను త‌న్నాడు. అదే స‌మ‌యంలో ఎవ‌రో ఆ వీడియో తీసి దాన్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్తా ఇప్పుడు వైర‌ల్ అయింది. ఏది ఏమైనా.. బంగ్లాదేశ్ ఆట‌గాళ్ల తీరు మాత్రం తీవ్ర ఆక్షేప‌ణీయం. వారు అలా ప్ర‌వ‌ర్తించ‌కూడ‌దు. స‌రే.. వారు క్రికెట్ బాగా ఆడుతున్నారు, కాద‌న‌లేం. కానీ ఎంత ఆట బాగా ఆడితే మాత్రం మ‌రీ ఇంత దూకుడు అయితే అస్స‌లు ప‌నికిరాదు క‌దా..!

Comments

comments

Share this post

scroll to top