కలెక్టర్ స్మితా సబర్వాల్ పాడిన పాటను మీరు విన్నారా.?

స్మితా సబర్వాల్… అందమైన రూపం, అంతకు మించిన మానవత్త్వం, ప్రజలకు సేవ చేయాలన్న ధృఢ సంకల్పం….అన్నీ సుగుణాలు కలగలిసిన IAS ఆఫీసర్. ఆమె పరిపాలన తీరు ప్రత్యక్షంగా చూసిన మెదక్ జిల్లా ప్రజలు ఆమెను దేవతగా చూస్తారు.  ప్రజా సేవే పరమావధిగా, అవినీతి ఆరోపణలు లేని కలెక్టర్ గా ఆమె పనిచేసిన చోటల్లా మంచి మార్కులే సంపాదించారు స్మితా. ఆమె పనితీరు మెచ్చిన KCR  అధనపు కార్యదర్శిగా నియమించుకున్నారు. చాలా మందికి స్మితా సబర్వాల్ పాలన గురించే తెలుసు కానీ ఆమెలో దాగున్న సింగర్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు…TV 5 తో జరిగిన ఓ ఇంటర్వ్యూలో స్మిత  ఓ మంచి పాటను పాడి వినిపించారు.

గ్రాడ్యుయేషన్‌ విద్యను హైదరాబాద్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో పూర్తి చేసిన స్మిత, 2001లో అదిలాబాద్‌లో ట్రైనీ కలెక్టర్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత  చిత్తూరు అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేసారు, మెదక్ జిల్లాలో కూడా కలెక్టర్ గా విధులు నిర్వర్తించారు.  స్మిత తండ్రి ఆర్మీలో ఉండేవారట..ఆయన బోర్ గా ఫీల్ అయినప్పుడు స్మిత చేత ఓ పాట పాడించుకునే వారట… ఆ పాటనే స్మితా సబర్వాల్ పాడి వినిపించారు.

Watch Smita Sabharwal Singing A Song:

Comments

comments

Share this post

scroll to top