కేవలం 500 రూపాయల ఖర్చుతో పెళ్లి చేసుకొని ఆదర్శంగా నిలిచింది ఈ నూతన IAS అధికారుల జంట. అంతంత మాత్రంగా ఉన్నోళ్లే పెళ్లికి లక్షలకు లక్షలు ఖర్చుచేస్తూ దర్పాన్ని ప్రదర్శిస్తున్న ఈరోజుల్లో….IAS లు సాధించి, సొసైటీ లో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న ఆ జంట తమ పెళ్లిని కేవలం 500 రూపాయల ఖర్చుతో జరుపుకోవడం విశేషం. అంతేకాదండోయ్..వీరిద్దరీ ప్రేమ వివాహం….మరో విషయం ఏంటంటే…పెళ్లి కూతురు మన ఆంద్రప్రదేశ్ లో ప్రోబేసరీ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు.
2014 బ్యాచ్ కి చెందిన ఆశిష్ వశిష్ట, సలోని సదన తమ IAS ట్రైనింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. అలా అని వారు తమ బాధ్యతలను మరువలేదు.కానీ పోస్టింగ్ వీరిద్దరినీ దూరం చేసింది. ఆశిష్ కు మధ్యప్రదేశ్ లో… సలోని సదన ను ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ లో పోస్టింగ్ లభించింది. బాధ్యతల పరంగ భౌతికంగా వీరిద్దరూ దూరమైనా మానసికంగా మాత్రం చాలా దగ్గరయ్యారు. వీరిమద్య ప్రేమ బలపడింది.ఈ క్రమంలోనే పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు.
కట్ చేస్తే…… మధ్యప్రదేశ్ లోని అడిషనల్ డిస్ట్రిక్ మెజిస్ట్రేట్ సమక్షంలో ఇద్దరు ఒక్కటయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా హజరై సాక్షి సంతకం కూడా చేశారు. ఎటువంటి హంగూ ఆర్బాటం లేకుండా కేవలం 500 రూపాయల ఖర్చుతో తమ వివాహ వేడుకను ముగించారు ఈ నూతన దంపతులు. మంచి ఉద్యోగం.. సంఘంలో గౌరవం.. కోట్లు ఖర్చు పెట్టేంత సత్తా ఉన్నా.. తమ పెళ్లి ఇలా సింపుల్ గా జరుపుకోడానికి కారణం పెళ్లంటే నూరేళ్లు కలిసుండాలి కానీ లక్షలు ఖర్చు పెట్టడం కాదని తెలియజెప్పడం కోసమే అంటున్నారీ న్యూ కపుల్స్.