రుద్రమదేవి కోసం బ్రూస్ లీ వాయిదా వేయాలని కోరడం ఫెయిర్ కాదు: గోనగన్నారెడ్డి.

రుద్రమదేవి కోసం బ్రూస్ లీ సినిమాను వాయిదా వేయాలని కోరడం ఫెయిర్ కాదన్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. రుద్రమదేవి సినిమాకు సరిగ్గా వారం తర్వాత గాప్ బ్రూస్ లీ సినిమా రేపు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చాలా మంది రుద్రమదేవిలాంటి చారిత్రాత్మక సినిమా నడవాలంటే పెద్ద సినిమా అయిన బ్రూస్ లీ విడుదలను వారం పాటు వాయిదా వేయాలంటూ  విజ్ఙప్తులు చేస్తున్నారు. కొంత మందైతే ఏకంగా చిరంజీవికి బహిరంగలేఖ లు కూడా రాశారు.

తాజాగా ఇదే విషయమై అల్లు అర్జున్ తన ట్విట్టర్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. రుద్రమదేవి కోసం బ్రూస్ లీ ని వాయిదా వేయాలని కోరడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా పండగ సమయంలో రిలీజ్ చేస్తేనే బాగుంటుందని, అయినా బ్రూస్ లీ ని అక్టోబర్ 16 న విడుదల చేస్తామని బ్రూస్ లీ యూనిట్ ఎప్పుడో చెప్పిందని అన్నారు బన్నీ.  చాలాకాలం తర్వాత చిరంజీవిని తెర మీద చూడడానికి తాను చాలా యాంక్జైటీ గా ఉన్నానని తెలిపారు.

Watch Allu Arjun Video:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top