ఐ ఫోన్ పై మోజుతోప్రాణాలనే పణంగా పెట్టింది చివరకు ఏమైందో తెలిస్తే షాక్ అవుతారు.??

కోరుకుంది దక్కడానికి కొందరు నానా కష్టాలు పడుతుంటారు. ఇంట్లో గొడవ పెట్టుకోనైన సరే తాము కావాలనుకుంది సాధిస్తారు. ఈ మధ్య యువత ఈ విషయంలో పోటీ పడుతున్నారు. మొబైల్ ఫోన్లలో అత్యంత ఖరీదైన ఫోన్ ఏదైనా ఉందా అంటే వెంటనే గుర్తొచ్చేది ఐ ఫోన్ . ఐ ఫోన్ వాడటం అంటే అదో స్టేటస్ గా భావిస్తారు కొందరు. అయితే అలాగే ఓ యువతి ఆలోచించి ఐ ఫోన్ కొనడానికి ఓ పని చేసి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఐ ఫోన్ మీద మోజుతో కొందరు ఇంట్లో వస్తువుల్ని అమ్మడం లేదా ఏదైనా పని చేసి ఐ ఫోన్ కొనడం చూసే ఉంటాం. ఇంకొందరు కిడ్నీలను అమ్ముకొని ఫోన్ కొనడం, మరికొందరైతే దొంగతనాలకు కూడా వెనుకాడట్లేదు. ఈ ఫోన్ కోసం ఎంత కష్టపడుతున్నారో ఇక చెప్పనక్కర్లేదు.

అయితే పైదంతా ఓ ఎత్తయితే ఇదో ఎత్తు చైనాలో ఓ యువతి ఐ ఫోన్ కొనాలనే మోజులో ఏకంగా అండాలనే అమ్మేసిన ఘటన హాట్ గా మారింది.

చైనాలోని యూనివర్సిటీలో చదువుతున్న యువతి విద్యార్ధిని ఐఫోన్ అంటే మహా మోజు. అయితే కొనడానికి తన దగ్గర డబ్బులు లేవు. ఎలాగైనా ఐ ఫోన్ కొనాలని ఓ మార్గం ఎంచుకుంది. ఫోన్ కొనాలన్న కోరిక కోసం ఏకంగా తన అండాలను బ్లాక్ మార్కెట్లో అమ్మడానికి నిర్ణయించుకుంది యువతి. తను తీసుకున్న ఈ నిర్ణయం ఆమె ప్రాణాలనే పణంగా పెట్టే పరిస్థితులకు దారితీసింది. విద్యార్థిని అండాలను తీసేందుకు శస్త్రచికిత్సకు మోతాదుకు మించి అధికంగా ఇంజెక్షన్లను ఇవ్వడం జరిగింది. ఈ ఇంజెక్షన్లు, సర్జరీలో భాగంగా అండాలను సేకరించేందుకు ఆమె అండాశయాన్ని దత్తత ఇవ్వడం జరిగింది. ఆమెకి శస్త్ర చికిత్స చేసి అందాలను సేకరించారు డాక్టర్లు.

సర్జరీ అప్పుడు బాగానే ఉన్న ఆ తరువాత మూడు రోజులకే ఆమె ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది. ఆమె తీవ్రమైన గ్యాస్, మరియు శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతుంది. ఏమైంది అని ఆసుపత్రికి వెళితే అక్కడ అసలు విషయం బయటపడింది. అండాలను అమ్మడం వలన ఈ సమస్య ఏర్పడిందని డాక్టర్లు చెప్పారు. అప్పుడు ఆ యువతి అండాలను అమ్మడం వల్ల తనకి ఎటువంటి హాని జరగదని ఆ బ్లాక్ మార్కెట్ సభ్యుడు తనకి చెప్పారని తెలిపింది.

ఐ ఫోన్ మోజులో పడి ప్రాణాలనే పణంగా పెట్టిన ఈ యువతి ఆరోగ్యం ముందు ముందు ఇంకెంత ఆరోగ్య సమస్యలు ఎదుర్కుంటుందో..

 

Comments

comments

Share this post

scroll to top