నా బతుకేదో నే బతుకుతున్నా.నన్నెందుకు టార్గెట్ చేస్తున్నారు:హీరోయిన్ లయ:

లయ ఒక్కప్పుడు టాలీవుడ్ లో వెలుగు వెలిగిన హీరోయిన్. స్వయంవరం సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన లయ అనతి కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎక్సపోజింగ్ కి ఏ మాత్రం చోటులేకుండా నటించిన హీరోయిన్. ఆమెకి హోమ్లీ హీరోయిన్ అని పేరు కూడా వచ్చింది. ఆ తర్వాత పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిల్ అయ్యింది. పెళ్ళి తరువాత లయ సినిమాల్లో నటించలేదు. అయితే తాజాగా అమర్ అక్బర్ ఆంటోనీ మూవీలో తన కూతురు శ్లోకతో కలిసి ఓ పాత్రలో నటించి తన రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది.

అయితే సోషల్ మీడియాలో లయపై కొన్ని వార్తలు వైరల్ గా మారాయి. దీనిపై స్పందించిన లయ సోషల్ మీడియాపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఎమోషనల్ అయ్యింది. ఇంతకీ ఎం జరిగిందంటే ఈ మధ్య లయ తెలుగులో సరిగా మాట్లాడలేదట. ఎక్కువకాలం అమెరికాలో ఉండటం వలన తెలుగు పరమ చెత్తగా మాట్లాడుతుందంటూ సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. తెలుగు రాని లయ అంటూ ప్రచారం వైరల్ అయ్యింది.

ఈ నేపథ్యంలో లయ ఓ ఇంటర్వ్యూలో తన ఆవేదనని వ్యక్తం చేసింది. తను తెలుగు అలానే మాట్లాడతానని, అయిన వేరే ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడి బాషా అలవాటు పడి కొంత తేడా వస్తుందన్నారు లయ. తెలుగులో ఖచ్చితంగా మాట్లాడే వాళ్ళు ఎంత మంది ఉన్నారని ప్రశ్నించింది. ఫంక్షన్స్ లలో తెలుగుకి బదులు బూతులు మాట్లాడుతున్నారు అలాంటి వాళ్ళని ప్రశ్నించకుండా తనపై ఇలాంటి ప్రచారం చేయడం బాధాకరమని వాపోయింది.

సోషల్ మీడియాలో ఫామిలీ ఫోటోలు పెట్టాలంటేనే భయంగా ఉందని , చిన్న పిల్లలను కూడా సోషల్ మీడియా వదలడం లేదని లయ చెప్పుకొచ్చింది. అమెరికాలో ఉంటున్న తనపై భాష సరిగా లేదని ఆడిపోసుకోవడం న్యాయమా ? అమ్మాయిలంటే అంత చులకనగా చూస్తున్నారు. ప్రతి ఇంట్లో అమ్మ,అక్క, చెల్లి, ఉంటారు వాళ్ళని కూడా ఇలాగే ప్రశ్నిస్తారా అని అడిగింది.

Comments

comments

Share this post

scroll to top