“బిగ్ బాస్” తర్వాత “అర్చన” నటించిన షార్ట్ ఫిలిం..!పెళ్లి చూపులకని వెళ్ళింది .. తర్వాత ఏమైంది.? [VIDEO]

అర్చన గుర్తుందా…నువ్వొస్తానంటే నేనొద్దంటానా,నేను,ఖలేజా సినిమాల్లో నటించిన అర్చన.అబ్బే గుర్తులేదు అంటారా..బిగ్ బాస్ అర్చన గుర్తుందా..ఇప్పుడు చటుక్కున గుర్తొచ్చింది కదా..ఎందుకు గుర్తుండదు. బిగ్ బాస్ కంటస్టంట్స్ అందరినీ సెలబ్రిటీస్ ని చేసేసింది కదా..ఎప్పుడో మొదటి ఫైవ్ ఎలిమినేషన్స్లో నే ఎలిమినేట్ అవుతుందనుకున్న అర్చన,ఫైనలిస్ట్స్ వరకు రావడం నిజంగా ఆశ్చర్యం..బిగ్ బాస్ మొదట్లో ఏ విధంగా ఉన్నప్పటికీ ,చివరి ఎపిసోడ్ కి దగ్గరవుతున్న కొద్దీ ప్రోగ్రాం ఆసక్తికరంగా మారడంతో పాటు కంటెస్టంట్స్ కూడా ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు..వారిలో అర్చన ఒకరు..బిగ్ బాస్ తర్వాత అర్చన ఒక షార్ట్ ఫిలింలో నటించింది..అదే ఐ లైక్  ఇట్ దిస్ వే…ఆడపిల్ల వంట చేయాలి,అబ్బాయి సంపాదించాలి..ఆడపిల్ల గట్టిగా నవ్వకూడదు,మగాడు ఏడవకూడదు..ఎన్నో ఆంక్షలు కదా ..వాటన్నింటి సమ్మిళితమే I Like It This Way..

శివకుమార్ రామచంద్రవరపు,అర్చన లీడ్ రోల్స్ పోషించిన ఈ సినిమాని అర్చనే స్వయంగా ప్రొడ్యూస్ చేసింది.ప్రేమామాలిని వనం దర్శకత్వం వహించారు.షార్ట్ ఫిలిం కోసం ఎంచుకున్న అంశంతో పాటు, గంగాధర్ అద్వైతా డైలాగ్స్ ఈ సినిమాకి చాలా ప్లస్.. కథ విషయానికి వస్తే ఆత్మాభిమానం,ఆత్మవిశ్వాసంతో బతికే అమ్మాయి కథానాయిక.స్త్రీలు అంటే ఎవరో ఒకరు చెప్పేది వింటూ ,మొగుడు సంపాదిస్తే చాలు అన్నట్టు వారిపై డిపెండ్ అయి బతకకుండా అస్తిత్వంతో బతకాలి అని చెప్పే అబ్బాయి మన హీరో..అలాంటిద్దరు పెళ్లి చూపుల్లో ఎదురుపడితే…జనరల్ గా  అబ్బాయిలు తమ పాత ప్రేమకథలు పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలకు చెప్తే  నవ్వేసి ఊరుకుంటారు.కానీ అమ్మాయిలు వారి ప్రేమకథలు చెప్తే మాత్రం అబ్బాయిలు ఏదో ఇబ్బందిగా ఫీల్ అవుతారు..అమ్మాయిలు స్వతంత్రంగా బతకాలి అని చెప్పే ఈ కథలో హీరో,హీరోయిన్ పాత బ్రేకప్ ల గురించి చెప్తే ఎలా రియాక్ట్ అయ్యాడు.మందు కొట్టే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా. వారిద్దరి పెళ్లి జరిగిందా లేదా అనేది కథ…

టైటిల్స్ దగ్గర నుండి డైలాగ్స్ వరకూ ప్రతీది ఇంట్రస్టింగా ఉన్నాయి.షార్ట్ ఫిలింస్ హీరో శివ ఎప్పట్లానే బాగా నటించాడు..అర్చన ఎలా నటించింది..సినిమా ఎలా ఉందనేది మీరు చూసి చెప్పండి…

watch video here:

Comments

comments

Share this post

scroll to top