మన బాధ్యత మనం నెరవేర్చడం కూడా దేశభక్తే..By అల్లు అర్జున్.

మన బాధ్యత మనం నెరవేర్చడం కూడా దేశభక్తే..మార్పు మనతోనే మొదలవ్వాలి..I Am That Change అన్న అల్లు అర్జున్ మాటలు గుర్తొచ్చాయ్ ఈ మద్యకాలంలోని కొన్ని దృశ్యాలను చూసి.ఎక్కడండీ ధట్ చేంజ్…  ఎవ్వరండీ మారేది… ఎక్కడినుండండీ మార్పు వచ్చేది. పిల్లలకు చెప్పాల్సిన తల్లీదండ్రులే ఇలా చేస్తుంటే… ???

సీన్ :1

ఖైరతాబాద్ సిగ్నల్…. బైక్ మీద ఓ కుర్రాడు ఫుల్ స్పీడ్ తో వెళుతున్నాడు…. సిగ్నల్ పడింది, అయినా అతడు పట్టించుకోలేదు..అలాగే సిగ్నల్ జంప్ చేసి ముందుకెళ్ళాడు..అక్కడే ఉన్న పోలీస్ అతడిని పట్టుకున్నాడు. కానీ ఫైన్ రాయాల్సిన అతను పచ్చనోటుకు పడిపోయాడు. బైక్ మళ్ళీ అదే స్పీడ్ తో దూసుకుపోయింది.

సీన్ 2: 

అరోజు సండే… పదేళ్ళ పిల్లాడిని తీసుకొని ఓ ప్యామిలీ పార్క్ కు వచ్చింది.  వచ్చేటప్పుడు ఓ అయితు లేస్(Lays)  చిప్స్ పాకెట్స్… రెండు థమ్సప్ బాటిల్స్ తీసుకొని వచ్చారు. దీంతో పాటు అక్కడ పల్లీలు అమ్ముతున్న వాడి దగ్గర ఓ 20 రూపాలయ పల్లీలు కొనుక్కున్నారు. గంట తర్వాత వాళ్ళు కూర్చొని వెళ్ళిన చోటంతా తినిపడేసిన లేస్ ప్యాకెట్స్, తాగిపడేసిన థమ్సప్ బాటిల్స్ , పల్లీల పొట్టు.

సీన్ 3:

టివీ పెట్టి వార్తలు చూస్తున్న….. బీహార్ లో అనుకుంటా.. పిల్లలు పరీక్షలు రాస్తుంటే గోడలు ఎక్కి మరీ… పిల్లలకు చిటీలు అందిస్తున్న పేరెంట్స్. ఇందేట్రా అని అడిగితే వాళ్ళు పాస్ కావొద్దా అంటూ సమాధానాలు.

సీన్ 4:

ఓ MLA కొడుకు బర్త్ డే రోజు, అతని స్నేహితులు.. రోడ్డుకు రాంగ్ సైడ్ గా భారీ ఎత్తున నినాదాలు చేసుకుంటూ కార్లలో ర్యాలీగా వెళ్ళిన లైవ్ ఎగ్జాంపుల్.

Watch Video:

 

 

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top