ఈ ఛాయ్ వాలా…. తన డబ్బుతో 70 మంది పిల్లలకు చదువు చెప్పిస్తున్నాడు.

అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదంటారు.. కానీ చదువే గొప్పదని, ఆ చదువు వల్ల వాళ్ళ జీవితాలను వారు నిర్మించుకోగలరని నిరూపించాడు ఓ చాయ్ వాలా. పేరుకే చాయ్ వాలా అయినా ఆయన చేస్తున్న గొప్ప పనులు చూస్తే, ఆయనకు సెల్యూట్ చేయకమానరు. చదువుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. రిక్షా నడుపుకుంటూ, కూలీ పనులు చేసుకుంటూ, మున్సిపాలిటీలలో పనిచేస్తూ తమ జీవనమే కష్టంగా బతుకుతున్న వారు, ఇక వారి పిల్లలను ఎక్కడ చదివించగలరు.

అది ఒడిశాలోని కటక్, ఆయన పేరు ప్రకాష్..
 వృత్తి: చాయ్ వాలా (టీ అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు). వయసు:58.
ఏం చేస్తాడు: ఉదయం, సాయంత్రం సిటీ సెంటర్ లో టీ అమ్ముతాడు.
అయితే మాకేంటీ : టీ అమ్ముతూ సంపాదించిన డబ్బుతో  50 శాతం సంపాదనను మురికివాడల్లో స్కూల్ ని స్టార్ట్ చేసి, అక్కడ 70 మంది పిల్లలకు ఉచితంగా చదువు చెబుతున్నాడు.
ఇంకా: ఇప్పటివరకూ 250 సార్లు రక్త దానం చేశాడు…
వావ్ గ్రేట్ అనుకుంటున్నారా.. ఇంకా ఆయన్ను ఆదర్శంగా తీసుకోవడానికి  ఆయన వ్యక్తిత్వం చాలదా?మనకు.. ఇంకా ఆయను చేస్తున్న గొప్ప పనుల గురించి తెలుసుకోవాలనుకుంటే ఒకసారి ఆ వీడియో చూడండి.
Watch Video:

Comments

comments

Share this post

scroll to top