“నాతో ఫోటో దిగి..నన్నే వెధవ అంటావా?”…కొడతారు బయట అని లైవ్ లోనే మహేష్ కత్తి పై “ఆది” ఫైర్.!

సినీ విమర్శకుడు మహేశ్‌ కత్తిపై జబర్దస్త్‌ కమెడియన్‌ హైపర్‌ ఆది ఇటీవల వేసిన సెటైర్‌లపై మండిపడ్డారు. ఈ గురువారం జబర్దస్త్‌లో హైపర్‌ ఆది స్కిట్‌లో బాగంగా ‘పెళ్లి అనేది మనం సినిమా తీసినంత కష్టం కానీ ప్రేమ ముందు పోట్ట వేసుకొని, వెనక బట్ట వేసుకొని రివ్యూలు రాసినంత ఈజీ’ అనే పంచ్‌లు తనను విమర్శించేలా ఉన్నాయని కత్తి మహేష్‌ మండిపడ్డారు. అవును నాకు పొట్ట ఉంది. బట్ట ఉంది. మనుషులంతా ఒక్కటేలా ఉంటారా.? ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. ఆ ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉండడమే ఈ ప్రపంచం. కాస్త భిన్నంగా ఉన్నంత మాత్రనా జోకర్స్‌ అయిపోతామా.? ఒకరు పొడుగ్గా ఉండొచ్చు.. ఇంకొకరు పొట్టిగా ఉండొచ్చు.. ఒకరు నల్లగా ఉండొచ్చు.. ఇంకొకరు తెల్లగా ఉండొచ్చు.. ఇంకొకరికి నత్తి ఉండి మాట్లాడలేకపోవచ్చు. నాలాగా బట్టతల ఉండొచ్చు. దట్ ఈజ్ మై స్టయిల్. నేను ఎలా ఉన్నానో అలానే ఉన్నాను. నేను లావుగా ఉన్నానని ఫీల్ అయ్యేంత చీప్ మెంటాలిటీ నాది కాదు. అంటూ తన ఫేస్‌బుక్‌ లైవ్‌ ద్వారా హైపర్‌ ఆదిని ఒక రకంగా పొగుడుతూనే విమర్శించారు. జబర్దస్త్ షో నేను చూడను, కానీ ఫ్రెండ్స్‌ పంపే లింక్స్ చూస్తే నాకు ఈ విషయాలు తెలిశాయని చెప్పాడు. అది ఒక గొప్ప షో అని కానీ, గొప్ప కామిడీ ఉంటుందని కానీ నేను అనుకోను. మనుషుల మీద వారు వేసుకునే బట్టల మీద కామెడీ చేస్తూ అపహస్యం చేస్తున్న దానిని హాస్యం అనుకొని ఎంజాయ్‌ చేస్తున్నారని అన్నారు. మనందరి దిగజారుడు తనానికి నిదర్శనం అని షో సాగుతున్న తీరునే విమర్శించాడు.

watch video here:

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు గురించి సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘పవన్ కళ్యాణ్ తన వద్ద అసలు డబ్బులే లేవని చెబుతున్నారు. మరి పబ్లిక్ పంక్షన్లకు ఖర్చు పెట్టేందుకు డబ్బెలా వస్తుందని సూటిగా అడిగాడు. అంతేగాకుండా పవన్ కల్యాణ్ నటన, రాజకీయ జీవితం, అతని అభిమానుల తీరుపై కత్తి మహేష్ చాలా విమర్శలు చేశాడు..’ ఈ నేపథ్యంలో కత్తి వ్యాఖ్యలపై తాజాగా జబర్దస్త్ తో పాపులర్ అయిన ఆది సైటైర్స్ వేసి నవ్వించారు. అయితే ఆ పంచులపై మహేష్ కత్తి తనదైన శైలిలో స్పందించడంతో సోషల్ మీడియాలో కాంట్రివర్సీ వివాదం రాజుకుంది.మహేష్ కత్తి క్యారెక్టర్ ని సుత్తి రాజేష్ గా మలచి అతనిపై పంచులు మీద పంచులు వేసాడు. సుత్తి రాజేష్ గడ్డాన్ని చూసి ఏంటి రా ఇది బార్బర్ షాప్ వాడు సగమే గొరిగాడా ఏంటి, నీది నువ్వు ఫుల్ గా గోక్కోలేవు, పక్కనోళ్ళని గోకడం మనకి అవసరమా.. అంటూ ఇండైరెక్టుగా మహేష్ కత్తి ఫై కామెంట్ చేసాడు ఆది. అలాగే సుత్తి రాజేష్ ఫోన్ తెచ్చి ఆది కి చూపించి ఫాన్స్ అన్నాడు ఎవరి ఫాన్స్ అంటే , ఎవరెవరో ఫాన్స్ అంటూ మళ్లీ పంచ్ వేసాడు. ‘దేవుడిని గెలికావ్ నీకు దేతడి, పోచమ్మ గుడే దిక్కు’ అంటూ మహేష్ కత్తి ఫై పంచులు వర్షం కురిపించారు.

watch video here:

 ఇది ఇలా ఉండగా మహేష్ కత్తి ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టి..మేము అందరం బాగానే ఉంటాం. మధ్యలో ఫాన్స్ వెదవలు అన్నాడు. దీంతో హైపర్ ఆది “నేను కూడా ఫ్యాన్..నాతో ఫోటో దిగి. నన్నే వెదవ అంటావా” అని కౌంటర్ ఇచ్చాడు. లైవ్ లో వీరిద్దరి గొడవ ఏంటో చూడండి!

watch video here:

Comments

comments

Share this post

scroll to top