సిగ్నల్స్ దగ్గర దొంగస్వాములు..హైద్రాబాద్ లో కొత్త తరహా బెగ్గింగ్ మాఫియా,తస్మాత్ జాగ్రత్త.!!

నవంబర్, డిసెంబర్ నెలలో  కొత్తరకం యాచకులు హైద్రాబాద్ సిగ్నల్స్ దగ్గర కనిపిస్తుంటారు. అయ్యప్ప స్వామిమాల వేసుకొని శబరి వెళ్లే నిమిత్తం అని యాచిస్తుంటారు.అలాంటి  దొంగ స్వాముల బంఢారాన్ని బయటపెట్టారు అసలు అయ్యప్ప స్వామి భక్తులు.  “20 మంది గుంపుగా వచ్చి…. ఓ లాడ్జ్ లో బస చేస్తూ హైద్రాబాద్ సిగ్నల్స్ దగ్గర యాచిస్తున్నామ”న్న నిజాన్ని వారిచేతే చెప్పించారు. దేవుడి పేరు మీద అడిగితే లేదనకుండా….ఎంతో కొంత ఇస్తారనే ఉద్దేశ్యంతో వారు ఈ పనికి పూనుకున్నట్టు తెలుస్తోంది. కొంతమందైతే..చిన్న పిల్లల చేత మాల వేయించి, వారి చేత బిక్షాటన చేయిస్తుంటారు.

మహిళలు  పిల్లల్ని కిరాయికి తెచ్చి వారిని సంకలో పెట్టుకొని యాచిస్తారని, వారి వెనుక వేరే వారు ఉంటారని…ఇదంతా పెద్ద ఎత్తున నడిచే బిజినెస్ అని…హైద్రాబాద్ లో బెగ్గింగ్ మాఫియా పేరుతో అనేక కథనాలు గతంలో  వచ్చాయి. తాజాగా ఈ సంఘటన వెలుగు చూసింది. ఇలాంటి  వాళ్ల వల్ల నిజమైన నిస్సహాయిలకు సాయం అందకుండా అవుతుంది.

Watch Video: 

 

Comments

comments

Share this post

scroll to top