సోషల్ మీడియాను షేక్ చేసిన వీడియో! మొన్న అలా…ఈ రోజు ఇలా…ఏంటో ఈ హైదరాబాద్ ట్రాఫిక్ పోలిసుల తీరు!

అయ్యా వదిలేయండి ఆ పుచ్చకాయలు అమ్ముకునే ఓ పేదవాడు బతిమాలినా ఓ ట్రాఫిక్ పోలీస్ నిర్దాక్షిన్యంగా ప్రవర్తించాడు. చివరికి సోషల్ మీడియా ద్వారా కేటీఆర్ గారు మంచి మనసుతో స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీ కి ఆదేశించారు. ఇది ఇంకా మరిచిపోని లేదు. హిమాయత్నగర్ లో మరో ట్రాఫిక్ పోలీస్ లంచం తీసుకుంటూ కెమెరా కు చిక్కాడు. ఆ వీడియో ని ఒకతను ఏకంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కే పంపించారు!

>>>సోషల్ మీడియాను షేక్ చేసిన ఫోటో…స్పందించిన “కేటీఆర్”!<<<

 

సిగ్నల్స్ దగ్గర ట్రాఫిక్ పోలీసులు లేకుంటే ట్రాఫిక్ లో ఎన్ని అనర్ధాలు జరుగుతాయో అందరికి తెలిసిందే. కొంతమంది నిజాయితీపరులు ఉంటే. మరికొంతమంది అవినీతి బాటనే నమ్మి అమాయాయులైన వాహనదారుల మీద లేని పోనీ ఫైన్లు వేసి చలాన్ల రూపం లో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇదంతా ఆ పోలీస్ – వాహనదారుడి మధ్యే ఉంటుంది. అది మూడో కంటికి చిక్కితే ఎలా ఉంటుందో మన హైదరాబాదీ హోంగార్డ్ చూపించారు. వాహనదారుడి నుంచి లంచం తీసుకుంటూ దొరికిపోయిన వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది.

నారాయణగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎం.సత్య విష్ణు హోంగార్డుగా పని చేస్తున్నాడు. మార్చి 17వ తేదీ హిమాయత్ నగర్ జంక్షన్ లో స్కూటర్ పై  వెళ్లే ఓ వాహనదారుడి దగ్గర లంచం తీసుకుంటుండగా.. అటుగా వెళుతున్న “శ్రీధర్ వేముల” అనే మరో వ్య్తకి  వీడియో తీశారు. ఆ వీడియోను ఫేస్ బుక్, యూట్యూబ్ లో పోస్టు చేశారు. ఈ వివరాలను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సోషల్ మీడియా వేదికకు లింక్ చేశారు. అతి కొద్దీ సమయంలోనే ఇది దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. అవినీతిపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. చాలా మంది నెటిజన్లు.. ఈ వీడియోను మినిస్టర్స్, పోలీస్ ఆఫీసర్స్ కు పోస్ట్ చేస్తున్నారు. మొత్తానికి ఓ హోంగార్డ్ అవినీతి దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ట్రెండింగ్ న్యూస్ లో చక్కర్లు కొడుతోంది. దీనిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారులు స్పందించారు. అతనిపై యాక్షన్ తీసుకుంటామని ప్రకటించారు అధికారులు.

Watch Video Here:

Great traffic policeHimayath nagar 4:30 PM 17 March 2017

Posted by Sridhar Vemula on Friday, 17 March 2017

 

Comments

comments

Share this post

scroll to top