టాప్ ఫైవ్‌లో హైద‌రాబాద్ బెస్ట్ – రిచెస్ట్ సిటీగా బ్రాండ్ నేమ్.!!

29వ కొత్త రాష్ట్రంగా ఏర్ప‌డిన తెలంగాణ రాష్ట్రం దేశానికే గ‌ర్వ‌కార‌ణంగా నిలుస్తోంది. ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా, పారిశ్రామిక ప‌రంగా, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ , టెలికాం, ఫార్మా , లాజిస్టిక్, ఈ కామ‌ర్స్ బిజినెస్‌, త‌దిత‌ర రంగాల‌లో త‌న‌దైన ముద్రతో ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకుంటోంది. కేపిట‌ల్ సిటిగా ఉన్న భాగ్య‌న‌గ‌రం అన్ని ప్రాంతాల వారికి , అన్ని వ‌ర్గాల వారికి ముఖ్యంగా పారిశ్రామిక‌వేత్త‌లు, వ్యాపార‌స్తుల‌కు అనువైన ప్రాంతంగా పేరు తెచ్చుకుంది. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర స‌మితి అధినేత కేసీఆర్ సీఎంగా ప‌లు కీల‌క‌మైన నిర్ణ‌యాలు తీసుకున్నారు. ప్ర‌తి రంగంలో త‌మ‌దైన బ్రాండ్ ఉండాల‌న్న ఉద్ధేశంతో యుద్ధ ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు చేప‌ట్టారు. చ‌ట్టాల‌ను మార్చేశారు. కేవ‌లం ఏడు పాయింట్ల‌తో పారిశ్రామిక పాల‌సీని తీసుకు వ‌చ్చారు. ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేసేందుకు పెట్టుబ‌డిదారుల‌కు స్వాగ‌తం ప‌లికారు.

వారు ఆన్‌లైన్ లో ద‌ర‌ఖాస్తు చేసుకున్నప్ప‌టి నుండి వితిన్ ఏడు రోజుల లోపు ప‌ర్మిష‌న్ ఇచ్చేలా ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌కు ఆదేశాలు ఇచ్చారు. ఒక‌వేళ ఏడు రోజుల లోపు ద‌ర‌ఖాస్తుదారుల‌కు అనుమ‌తి రాక పోతే ఎనిమిదో రోజు ప‌ర్మిష‌న్ వ‌చ్చేసిన‌ట్టే భావించాల్సి ఉంటుంద‌ని అధికారుల‌కు షాకింగ్ ఇచ్చారు. దీంతో వ్యాపారులు, పెట్టుబ‌డిదారులు ..ఇత‌ర రాష్టాల‌కు చెందిన వారితో పాటు ప‌లు దేశాల‌కు చెందిన వ్యాపార దిగ్గ‌జాలు తెలంగాణ‌కు క్యూ క‌ట్టాయి. హైద‌రాబాద్ ను కీల‌క‌మైన న‌గ‌రంగా పేర్కొంటున్నారు. ఐటీ రంగానికి సంబంధించి ఐటీ దిగ్గ‌జ కంపెనీలు ఈ న‌గ‌రానికే ఓటు వేశారు. ఇదే త‌మ‌కు అనుకూల‌వంత‌మైన ప్రాంతంగా పేర్కొన్నారు. టూరిజం ప‌రంగా గ‌ణ‌నీయ‌మైన ఆదాయం ల‌భించింది.

ఈ కామ‌ర్స్ రంగం విస్త‌రించింది. సూప‌ర్ మాల్స్, త్రీస్టార్, ఫైవ్ స్టార్ హోట‌ల్స్ ఏర్పాట‌వుతున్నాయి. ప్ర‌పంచంలోనే అత్యున్న‌త‌మైన సేవ‌లు అందించే సంస్థ‌గా జీఎంఆర్ పేరుగాంచింది. హైద‌రాబాద్ ఎయిర్ పోర్టు అద్బుత‌మైన ఎయిర్ పోర్టుగా వినుతికెక్కింది. ఇక్క‌డి నుండి దేశ వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల‌తో పాటు అమెరికా, లండ‌న్, ఫ్రాన్స్, బ్యాంకాక్, సింగ‌పూర్, మ‌లేషియా, శ్రీ‌లంక‌, దుబాయి, యుఏఇ, ర‌ష్యా త‌దిత‌ర న‌గ‌రాల‌కు నేరుగా ప్ర‌యాణం చేసేందుకు వీలుంది. స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా, ఇండిగో, విస్తారా, గోఎయిర్, ట్రూ జెట్, లాంటి సంస్థ‌లు గాలిమోట‌ర్ల‌ను ఏర్పాటు చేశాయి. ఆక‌ర్ష‌ణీయ‌మైన ప్యాకేజీల‌తో ఆక‌ట్టుకుంటున్నాయి. ఇదంతా వ్యాపారాలు ఏర్పాటు కావ‌డం, వేలాది మందికి ఉపాధి దొరుకుతోంది. కొత్త‌గా స్టార్ట‌ప్ లు పుట్ట‌గొడుగుల్లా పుట్టుకు వ‌స్తున్నాయి. ప్రైవేట్ యూనివ‌ర్శిటీల ఏర్పాటుకు స‌ర్కార్ ప‌చ్చ జెండా ఊపింది.

జీడీపీ ప‌రంగా దేశంలో ఏయే న‌గ‌రాలు అభివృద్ధి చెందాయో ఆక్స్‌ఫోర్డ్ ఎక‌నామిక్స్ ఇనిస్టిట్యూష‌న్ ప్ర‌పంచ వ్యాప్తంగా 780 కేపిట‌ల్ సిటీల‌ను ప‌రిశీలించింది..ప‌రిశోధించింది. అత్యంత ధ‌న‌వంత‌మైన న‌గ‌రాలు 2019 నుండి 2035 వ‌ర‌కు ఎలా ఉండ‌బోతున్నాయో వివ‌రాలు వెల్ల‌డించింది. న్యూయార్క్, టోక్యో, లండ‌న్ ప‌ట్ట‌ణాల‌కు కేవ‌లం 10 మీట‌ర్ల దూరంలో మ‌న ప‌ట్ట‌ణాలు ఉండ‌బోతున్నాయి. ఇండియా కంట్రీ వ‌ర‌కు వ‌స్తే 28.5 జీడీపీతో 9.17 గ్రోత్ రేట్‌తో సూర‌త్ న‌గ‌రం మొద‌టి స్థానంలో నిలిచింది. 2035లో 126.8 గ్రోత్ రేట్‌ను సాధించ‌బోతున్న‌ట్లు పేర్కొంది. రెండో స్థానంలో ఆగ్రా 3.9 జీడీపీ కాగా 8.58 శాతంతో గ్రోత్ రేట్ తో 2035 వ‌ర‌కు చూస్తే 15.6 శాతం ఉండ‌బోతోంది. బెంగ‌ళూరు 70.8 జీడీపీ ఉండ‌గా 8.50 శాతం గ్రోత్ రేట్‌తో 283.3 తో 2035లో సాధించ‌నుంది. ఇక హైద‌రాబాద్ న‌గ‌రం నాలుగో స్థానం నిలిచింది.

50.6 జీడీపీ తో 8.47 శాతం వృద్ధి రేటుతో 201.4 శాతం 2035 లో ఉండ‌బోతోంది. నాగ్ పూర్ ప‌ట్ట‌ణం 12.3 జీడీపీ సాధించ‌గా 8.36 శాతం గ్రోత్ రేట్ తో 48.6 శాతంతో 2035లో సాధించ‌నుంది. తిరుప్పూర్ న‌గ‌రం 4.3 జీడీపీతో 8.36 శాతం గ్రోత్ రేట్ తో 2035లో 17 శాతం ఉండ‌బోతోంది. మ‌రో వైపు రాజ్ కోట్ ప‌ట్ట‌ణం అభివృద్ధిలో ప‌రుగులు తీస్తోంది. 6.8 శాతం జీడీపీతో 8.33 గ్రోత్ రేట్ తో ఏడో స్థానంలో నిలిచింది. 2035లో దీని అభివృద్ధి రేటు 26.7 శాతంగా ఉండ‌బోతోంది.

తిరుచ్చి రాప్ప‌ల్లి న‌గ‌రం 4.9 శాతం జీడీపీ సాధించి 8.33 శాతం వృద్ధి రేటుతో 2035లో 19 శాతం ఉండ‌బోతోంది. చెన్నై 36 శాతం జీడీపీతో 8.17 వృద్ధి రేటు ను సాధించి 136.8 శాతంగా 2035 ఉండ‌బోతోంది. విజ‌య‌వాడ ప‌ట్ట‌ణం 5.6 జీడీపీతో 8.16 శాతం వృద్ధి రేటును సాధించి..21.3 శాతంతో 2035లో ఉండ‌బోతోంది. అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకు పోతున్న హైద‌రాబాద్ నాలుగో స్థానం నుండి త్వ‌ర‌లో మొద‌టి స్థానం సాధించాలంటే ఇంకా క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంది. ఇందుకు ప్ర‌భుత్వం పూర్తి స్థాయిలో స‌హ‌కారం అందిస్తే అన్ని రంగాల‌లో ముందుకెళ్ల‌గ‌లుగుతుంది.

Comments

comments

Share this post

scroll to top